Sudigali Sudheer: గాలోడు.. ఇప్పుడు హైలెస్సో అంటూ వస్తున్నాడు
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:07 PM
జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఒకడు.
Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఒకడు. సింగింగ్, డ్యాన్సింగ్, హోస్టింగ్, కామెడీ.. ఇలా అన్నింటిలో కూడా సుధీర్ తన సత్తా చూపిస్తూ బుల్లితెర అభిమానులకు దగ్గరయ్యాడు. అదే గుర్తింపుతో సినిమాలో స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా కూడా కనిపించి మెప్పించాడు. ఇక కమెడియన్ నుంచి హీరోగా మారి నాలుగు సినిమాల్లో నటించాడు. అందులో గాలోడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాలింగ్ సహస్త్ర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఇక సుధీర్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో గోట్ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి టాలీవుడ్ కు పరిచయం కానుందని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే బడ్జెట్ సమస్యలతో గోట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక సినిమా ఆగిపోవడంతో సుధీర్ బ్యాక్ టూ బుల్లితెర అంటూ హోస్ట్ గా పలు షోస్ తో బిజీగా మారాడు.
ప్రస్తుతం కొద్దిగా గ్యాప్ తీసుకొని తాజాగా తన 5వ సినిమాను ప్రకటించాడు. ప్రసన్న కుమార్ కోట అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మెగా ఫ్యాన్ అయిన శివ చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులోనే సినిమా టైటిల్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకు హైలెస్సో అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో అమ్మవారి పాదం మాత్రమే చూపించారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రంలో కోర్ట్ ఫేమ్ శివాజీ విలన్ గా నటిస్తున్నాడు. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమా అయినా మధ్యలో ఆగకుండా ఫినిష్ అవుతుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.
Tollywood: తెలుగు చిత్రసీమలో విషాదం
Ashika Ranganath: నాలుగేళ్ళ క్రితం సినిమా ఇప్పుడు...