Allu Arjun: బన్నీ సినిమా.. జపనీస్ కొరియోగ్రాఫర్ హోక్ పోస్ట్ వైరల్
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:16 PM
అల్లు అర్జున్, అట్లీ జోస్ పెంచారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో మొదలై ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
అల్లు అర్జున్, అట్లీ (Atlee) జోష్ పెంచారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో మొదలై ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి విదేశీ టెక్నీషియన్లు పని చేస్తున్న సంగతి తెలిసిందే! జపనీస్ కొరియోగ్రాఫర్ హోక్ ఈ సినిమాకు పని చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఆయన ఈ సినిమాకు సంబంధించి బీటీఎస్ ఫొటోలను షేర్ చేశారు.
‘గత నెల రోజులుగా ఓ (Indian cinema) ఇండియన్ సినిమాకు పని చేస్తున్నా. నేను చేసిన పని గురించి అప్‌డేట్ ఇవ్వాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. ఇండియన్ సినిమాలకు పని చేయాలనే క్యూరియాసిటీ ఇప్పటిది కాదు.. చాలా కాలంగా ఉంది. ఇదొక అద్భుతమైన జర్నీ. అయితే ఈ సినిమా గురించి విషయాలు ఇప్పుడే చెప్పలేను. కానీ ఈ ప్రాజెక్ట్ మేం అనుకున్న దానికంటే గొప్పగా వస్తుంది. ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. సినిమా భారీగా ఉంటుంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, అట్లీతో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. వాటిని చూసి సినిమా గురించి అప్‌డేట్ దొరికిందని అభిమానుల్లో జోష్ పెరిగింది. పునర్జన్మల ఇతివృత్తంగా సాగే సైన్స్‌ఫిక్షన్ సినిమా ఇదని చిత్ర బృందం నుంచి సమాచారం. అయితే దర్శకుడు మాత్రం ఇప్పటిదాకా జానర్ ఏంటనేది చెప్పలేదు. యాక్షన్ భారీగా ఉంటుందని హింట్ ఇచ్చాడు. ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టర్ మూడు కోణాల్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతోపాటు విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉండగా దీపికా పదుకోన్ ఓ నాయికగా ఎంపిక చేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.