Kajal Aggarwal: కాజల్ అందం ముందు.. సాయి పల్లవి ఎంత‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 08:42 PM

కాజల్ (Kajal Aggarwal) అందం ముందు సాయి పల్లవి (Sai Pallavi) అందమెంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ.

Ramayana

Kajal Aggarwal: కాజల్ (Kajal Aggarwal) అందం ముందు సాయి పల్లవి (Sai Pallavi) అందమెంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. సినిమా ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నంతవరకే అవకాశాలు వస్తాయి. అయితే అందాల భామ కాజల్ కు మాత్రం అందం ఎక్కువ ఉండే సరికే అద్భుతమైన అవకాశం చేజారిపోయింది. అదేంటి.. అలా ఎలా పోతుంది అని అనుకుంటున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం రామాయణ (Ramayana). బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ హీరో యష్ (Yash) రావణాసురుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.


భారీ బడ్జెట్ తో అత్యంత ఉన్నతమైన టెక్నాలజీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఒక చిన్న గ్లింప్స్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సీతగా సాయిపల్లవి పర్ఫెక్ట్ యాప్ట్ అని అందరూ చెప్పుకొస్తున్నారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నా కూడా అదెవరూ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక మండోదరి పాత్రలో అంటే రావణాసురుడు భార్యగా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ విషయాన్నీ ఆమె కన్ఫర్మ్ కూడా చేసింది. రామాయణలో నటించడం తన అదృష్టమని కూడా చెప్పుకొచ్చింది.


అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామాయణ నుంచి కాజల్ తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటి.. అంత మంచి పాత్రను ఎందుకు వదులుకుంది అనే అనుమానాలు రాకమానదు. కానీ, కాజల్ ఈ పాత్ర నుంచి తప్పుకోవడానికి కారణమా ఆమె అందమే అని చెప్పుకొస్తున్నారు. సీత కన్నా మండోదరి అందంగా ఉంటే.. చూసేవారికి కన్విన్స్ గా ఉండదని, సాయిపల్లవి కన్నా కాజల్ చాలా అందంగా ఉంటుందని, అలాంటి పాత్రలో కాజల్ ను ఎలా తీసుకున్నారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే సీతగా సాయిపల్లవిని మార్చండి.. లేకపోతే మండోదరిగా కాజల్ ను మార్చండి అని డిమాండ్ చేస్తున్నారు.


నిజం చెప్పాలంటే రావణాసురుడు సీత అందానికి మోహించి ఆమెను తీసుకెళ్లలేదు. ఇది అందరికి తెల్సిన విషయమే. కానీ, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఆ పాత్రలో ఎవరు కనిపిస్తున్నారు అనేదే ఎక్కువగా చూస్తున్నారు. అందుకే సాయిపల్లవి, కాజల్ అందాన్ని చూస్తున్నారు కానీ.. వారి పాత్రలు చూడలేకపోతున్నారు అనేది కొందరి వాదన. ఏదిఏమైనా కాజల్ అందం ముందు సాయిపల్లవి ఎంత అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఈ ట్రోల్స్ బారిన పాడడం ఎందుకు అనుకున్నారో ఏమో మేకర్స్ కాజల్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ను రీప్లేస్ చేశారని సమాచారం. అలా కాజల్ తన అందం వలన మండోదరి పాత్రను మిస్ అయ్యిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

OG Movie: హమ్మయ్య పవన్ ముగించేశాడు.. ఇక రచ్చ మొదలెట్టడమే

Updated Date - Jul 11 , 2025 | 09:19 PM