OG Movie: హమ్మయ్య పవన్ ముగించేశాడు.. ఇక రచ్చ మొదలెట్టడమే
ABN , Publish Date - Jul 11 , 2025 | 07:47 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా కుర్ర డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ (OG).
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా కుర్ర డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ (OG). డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. వీరే కాకుండా అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి లాంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి.
నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా అని థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే కొనసాగుతుంది. అన్ని సెట్ అయ్యి ఉంటే గతేడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, పవన్ పదవి, పనుల వలన షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక పదవిని మ్యానేజ్ చేస్తూనే పవన్ ఓజీ షూటింగ్ ను ఫినిష్ చేశాడు. మొన్ననే పవన్ తన భాగం షూటింగ్ ను పూర్తి చేయగా నేటితో సినిమా మొత్తం షూటింగ్ ను ఫినిష్ చేశారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా చెప్పుకొచ్చారు.
'అన్ని షూటింగ్‌లు పూర్తయ్యాయి.. ఇప్పుడు థియేటర్ల వంతు..ఓజీ యొక్క ఎరా ఆశ్చర్యపరుస్తుంది' అంటూ రాసుకొచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అదే రోజున అఖండ 2 కూడా రానుంది. అఖండ 2 వస్తుండడంతో.. ఓజీ వెనక్కి తగ్గుతుంది అనుకున్నారు. కానీ, మేకర్స్ మాత్రం మరోసారి అదే డేట్ ను వస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈసారి పోటీ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. ఇక పోస్టర్స్, సుజీత్ టేకింగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసారి ఖచ్చితంగా ఓజీ హిట్ కొడుతోంది అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఇప్పటి నుంచే హంగామా మొదలెట్టేసారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు సిద్దంకండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.