సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dharmendra: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం విషమం.. స్పందించిన టీమ్

ABN, Publish Date - Nov 10 , 2025 | 05:45 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం చెప్పాల్సిన అవసరం లేదు.

Dharmendra

Dharmendra: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం చెప్పాల్సిన అవసరం లేదు. 80 వ దశకంలో ఆయన బాలీవుడ్ ను ఒక ఊపు ఊపారు. గత కొన్నిరోజులుగా ధర్మేంద్ర వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారని, శ్వాస సంబంధిత సమస్యతో అక్టోబర్ 31 న ముంబైలోని వెళ్లినట్లు సమాచారం. ఇక ఇప్పుడు మరోసారి ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లారని, ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

తాజాగా ఈ వార్తలపై ధర్మేంద్ర టీమ్ స్పందించింది. ఆయన ఆరోగ్యం విషమించింది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ధర్మేంద్ర ఒక సినిమాలో కూడా నటిస్తున్నారు. 89 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన ఇక్కీస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Vijay: సత్తా చాటుతున్న జన నాయగన్...

Bhartha Mahasayulaku Wignyapthi: భర్తలందరికీ రామ సత్యనారాయణ చేసిన విజ్ఞప్తి ఏంటంటే..

Updated Date - Nov 10 , 2025 | 05:45 PM