Bhartha Mahasayulaku Wignyapthi: భర్తలందరికీ రామ సత్యనారాయణ చేసిన విజ్ఞప్తి ఏంటంటే..

ABN , Publish Date - Nov 10 , 2025 | 04:27 PM

మాస్ మహారాజా రవితేజ (Raviteja) గత కొంతకాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య వచ్చిన మాస్ జాతర (Mass Jathara) కూడా రవితేజకు విజయాన్ని అందించలేకపోయింది.

Bhartha Mahasayulaku Wignyapthi

Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ మహారాజా రవితేజ (Raviteja) గత కొంతకాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య వచ్చిన మాస్ జాతర (Mass Jathara) కూడా రవితేజకు విజయాన్ని అందించలేకపోయింది. పేరు ముందు మాస్ మహారాజా అని పెట్టుకున్నందుకు అదే మాస్ సినిమాలు చేసి చేసి రవితేజకు బోర్ కొట్టకపోయినా ప్రేక్షకులు మాత్రం ఆయన నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇక అభిమానుల కోరిక మేరకు రవితేజ కూడా రూటూ మార్చాడు. మాస్ నుంచి క్లాస్ కు వచ్చాడు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి RT76 గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ఆషికా రంగనాధ్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు.

కొన్నిరోజుల నుంచి ఈ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఆ టైటిల్ నే మేకర్స్ ఖరారు చేస్తూ ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఇద్దరు ఆడవాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం వెతికే మగాడు రామ సత్యనారాయణగా రవితేజ కనిపించాడు. అయితే ఆ ఇద్దరు ఆడవాళ్లు అడిగిన ప్రశ్న ఏంటి.. ? దానివలన రామ సత్యనారాయణ జీవితం ఎటుపోయింది. భర్తలందరికీ రామ సత్యనారాయణ చేసిన విజ్ఞప్తి ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతోనైనా రవితేజ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

The Family Man S1 and S2: ‘ఫ్యామిలీ మ్యాన్‌’.. ఏం జరిగిందో మరోసారి

Actor Abhinay: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి

Updated Date - Nov 10 , 2025 | 04:27 PM