సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tamannaah Bhatia: తమన్నా.. అంత మాట అనేసిందేంటి.. 

ABN, Publish Date - Sep 30 , 2025 | 11:46 AM

మిల్కీ బ్యూటీ తమన్నాకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీసులు,  ఐటెం సాంగ్స్ వైపు  దృష్టి సారిస్తోంది.

మిల్కీ బ్యూటీ తమన్నాకు (Tamannaah Bhatia) హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీసులు,  ఐటెం సాంగ్స్ వైపు  దృష్టి సారిస్తోంది. ఈ మధ్యన చాలా ఐటమ్ సాంగ్స్ (Special songs) చేసింది తమన్నా. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషా చిత్రాల్లో నటించినా రాని క్రేజ్‌, పేరు ఐటమ్‌ సాంగ్స్‌ ద్వారా వచ్చిందని మిల్కీబ్యూటీ  అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో  ‘నేను తెలుగు, తమిళం, హిందీ తదితర భాషా చిత్రాల్లో నటించాను. అపుడు ఏ ఒక్క చిత్రం నాకు సరైన బ్రేక్‌ ఇవ్వలేదు. కానీ, అల్లు అర్జున్‌తో కలిసి ‘బద్రీనాథ్‌’ సినిమాలో నటించిన తరువాత, దానిని చూసిన పలువురు నిర్మాతలు ప్రత్యేక గీతాలు చేసేందుకు ఆహ్వానించారు. అలా దక్షిణ భారత చిత్రాలతో పాటు బాలీవుడ్‌ మూవీల్లో నేను చేసిన ఐటమ్‌ సాంగ్‌లు మంచి పేరుతో పాటు క్రేజ్‌ తెచ్చిపెట్టాయి. అందుకు మున్ముందు కూడా ప్రత్యేక గీతాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.


అయితే నటిగా తెలుగులో ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ.. నటన వల్ల కాకుండా ప్రత్యేక గీతాల వల్లే గుర్తింపు వచ్చిందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  కాగా, ‘అరణ్మనై-4’ తర్వాత తమిళంలోనూ, ‘ఓదేలా-2’ తర్వాత తెలుగులో ఒక్క కొత్త అవకాశం కూడా తమన్నాకు రాలేదు.  బాలీవుడ్‌లో మాత్రం ‘రోమియో’, ‘రేంజర్‌’, ‘వివన్‌’తో సహా మొత్తం 4 చిత్రాల్లో  నటిస్తోంది. 

ALSO READ: Mega Fans: బాలయ్యపై ఫిర్యాదు.. తరలి వచ్చిన మెగా అభిమానులు

Trump: ట్రంప్‌ నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద షాక్‌

Mega Family: పవన్‌తో కలిసి ‘ఓజీ’ సినిమా వీక్షించిన మెగా ఫ్యామిలీ

The Raja Saab Trailer: వింటేజ్ ప్రభాస్ ఓకే.. కానీ, ఏదో మిస్సయ్యినట్టుందే

Updated Date - Sep 30 , 2025 | 12:00 PM