సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shah Rukh Khan: అవార్డు అందుకోవడానికి ఒక చెయ్యి చాలు.. కానీ...

ABN, Publish Date - Aug 21 , 2025 | 09:51 AM

అవార్డు అందుకోవడానికి ఒక చెయ్యి చాలన్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌(Shah rukh khan) .


అవార్డు అందుకోవడానికి ఒక చెయ్యి చాలన్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌(Shah rukh khan) . ఆయన తనయుడు ఆర్యన్‌ఖాన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ (The bads of bollywood) వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ విడుదల వేడుకలో షారుక్‌ సందడి చేశారు. ‘కింగ్‌’ సినిమా షూటింగ్‌లో ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. దాంతో చిన్న సర్జరీ జరిగింది. ఆ విషయంతోపాటు నేషనల్‌ అవార్డ్‌ గురించి ఆయన స్పందించారు.

ఇటీవల చిన్న ప్రమాదంలో భుజానికి గాయమైంది. రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటా. ఇక జాతీయ అవార్డు అందుకునేందుకు ఒక్క చెయ్యి సరిపోతుంది. ప్రస్తుతం ఒక్క చెయ్యితోనే బ్రష్‌ చేస్తున్నా, తింటున్నా. కానీ, మీ ప్రేమను పోగు చేసుకునేందుకు ఒక్క చెయ్యి సరిపోదు’ అని అన్నారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఇటీవల కేంద్ర ప్రకటించింది. ‘జవాన్‌’లోని నటనకుగానూ షారుక్‌ ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్యన్‌ఖాన్‌ సిరీస్‌ విషయానికొస్తే హిందీ సినిమా పరిశ్రమ ఇతివృత్తంగా రూపొందిన ఈ సిరీస్‌ సెప్టెంబరు 18 నుంచి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ర్టీమింగ్‌ కానుంది. సల్మాన్‌ఖాన్‌, రణ్‌వీర్‌సింగ్‌ తదితరులు గెస్ట్‌ రోల్స్‌లో కనిపించనున్నారు.

ALSO READ: Salakaar: ఇండో - పాక్ సంబంధాలపై మరో వెబ్ సీరిస్

Chiru - Megs Blast: విశ్వంభర.. చిరంజీవి మరో లీక్‌ ఇచ్చారు..

Updated Date - Aug 21 , 2025 | 09:55 AM