Salman Khan: బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కోసం తొలిసారి...
ABN, Publish Date - Jul 11 , 2025 | 10:33 AM
బాలీవుడ్ అందాల భామ చిత్రాంగద సింగ్ తొలిసారి సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన తొలిసారి చిత్రాంగద సింగ్ (Chitrangda Singh) నటిస్తోంది. అదీ ప్రతిష్టాత్మక చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' (Battle of Galwan) లో. సల్మాన్ ఖాన్ ఆర్మీ అధికారిగా నటిస్తున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారత్ - చైనా సరిహద్దుల వద్ద 2020లో గాల్వాన్ లో జరిగిన యుద్థం గురించి తెలిసిందే. ఆ సంఘటనలనే దర్శకుడు అపూర్వ లఖియా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాలో చిత్రంగద సింగ్ ను తీసుకోవడంపై దర్శకుడు అపూర్వ స్పందిస్తూ, 'చిత్రాంగద నటన, ప్రతిభ కారణంగానే ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆమెలో కలిసి పనిచేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది' అని చెప్పారు. ఇరవై సంవత్సరాల క్రితం 'హజారోం ఖ్వాయిషీ ఐసీ' చిత్రంతో చిత్రాంగద సింగ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలంగా ఆమెకు తెలుగులోనూ పలు ఆఫర్స్ వచ్చినా... ఎందుకో అవేవీ మెటీరియలైజ్ కాలేదు. అయితే తమిళ అనువాద చిత్రం 'సికందర్'తో చిత్రాంగదా సింగ్ తెలుగువారికి సుపరిచితమే. అందులో ఆమె ఐటమ్ సాంగ్ లో నర్తించింది.
Also Read: Ashu Reddy: మళ్లీ లైన్‌లోకి.. వచ్చిన అషురెడ్డి! నెటిజన్లకు పండగే
Also Read: Film Industry: దర్శక నిర్మాత గిరిబాబు భార్య మృతి