Saiyaara: రూ. 200 కోట్లు నాట్ అవుట్...
ABN, Publish Date - Jul 26 , 2025 | 05:38 PM
కొత్తవారితో మొహిత్ సూరి తెరకెక్కించిన 'సయారా' బాక్సాఫీస్ బరిలో చెలరేగిపోతోంది. శనివారంతో ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్ ను దాటేస్తోంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై జులై 18న విడుదలైన 'సయారా' (Saiyaara) బాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో స్వైర విహారం చేస్తోంది. 'సయారా' దూకుడుకు తట్టుకోవడం కష్టమని భావించే అజయ్ దేవ్ గన్ తన 'సన్నాఫ్ సర్దార్ -2' (Son of Sardaar -2) చిత్రం విడుదలను ఓ వారం వెనక్కి జరుపుకున్నారు. శుక్రవారం నాడు ఈ సినిమా రూ. 18.50 కోట్ల ను వసూలు చేసి, మొత్తంగా రూ. 193.75 కోట్ల ను వసూలు చేసింది. దాంతో ఈ శనివారం కలెక్షన్స్ తో 'సయారా' మూవీ రూ. 200 కోట్ల గ్రాస్ ను దాటేయబోతోంది. ఆదివారం నుండి ఇది రూ. 300 కోట్ల క్లబ్ లోకి చేరడానికి రంగం సిద్థమౌతుందని అనుకోవాలి. విశేషం ఏమంటే... 'సయారా' మొదటి వారం దేశవ్యాప్తంగా 2, 225 స్క్రీన్స్ లో ప్రదర్శితమైతే... రెండో వారానికి వీటి సంఖ్య 3,650కి పెరిగింది. అలానే సినిమా కలెక్షన్స్ కూడా ఏ రోజునా తగ్గిపోలేదు. ఏడో రోజు కు సరి సమానంగా ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఉండటం విశేషం.
ఈ మధ్య కాలంలో 'సయారా' తరహాలో డబుల్ సెంచరీ సాధించిన సినిమాలు వేళ్ల మీద లెక్కించాల్సినవే. విశేషం ఏమంటే... 'హౌస్ ఫుల్ 5, సికిందర్, రైడ్ 2, సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par), స్కై ఫోర్స్ (Sky Force), కేసరి చాప్టర్ 2 (Kesari Chapter-2), జాట్ (Jaat) చిత్రాలు లైఫ్ టైమ్ వసూళ్ళను 'సయారా' దాటేసింది. ఒక్క 'ఛావా' మాత్రం 'సయారా' కంటే వసూళ్ళలో ముందుంది. బాలీవుడ్ లో సరైన సక్సెస్ మూవీస్ లేని సమయంలో కొత్త వాళ్ళతో తీసిన 'సయారా' సరికొత్త ఊపిరిని అందించిందనే చెప్పాలి. ఇదే ఊపులో ఆగస్ట్ 14న రాబోతున్న 'వార్ -2' ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.
Also Read: Vijay Sethupathi: కాస్తంత ఆలస్యంగా తెలుగులో 'సార్.. మేడమ్'
Also Read: Alia Bhatt: ‘వార్-2’లో ఆలియా.. నిజమేనా..