Saiyaara: ఆ రెండు సినిమాలను తలపించేలా...

ABN , Publish Date - Jul 08 , 2025 | 01:02 PM

అహన్ పాండే, అనీత్ పద్దా జంటగా నటించిన సినిమా 'సయారా'. ఈ నెల 18న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

హిందీ చిత్రసీమలో ప్రేమకథలకు అంతేలేదు. అయితే... కొన్ని ప్రేమకథలు విషాదాంతాలైతే... మరికొన్ని సుఖాంతాలు అవుతాయి. సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీలే కాదు... చిత్రంగా ఫెయిల్యూర్ లవ్ స్టోరీలూ విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) తో కలిసి ఫస్ట్ టైమ్ మోహిత్ సూరి (Mohith Suri) తెరకెక్కిస్తున్న 'సయారా' (Saiyaara) ఎలాంటి ముగింపును ఇచ్చిందో తెలియదు కానీ ఇంటెన్స్ లవ్ స్టోరీ అని మాత్రం... లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది.


అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా నటిస్తున్న 'సయారా' చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు కొన్ని విడుదలై శ్రోతల ఆదరణ పొందాయి. ఈ జనరేషన్ కు మోహిత్ సూరి 'రాక్ స్టార్' (Rock Star), 'ఆషికీ -2' (Aashiqui -2) చిత్రాలను మరోసారి పరిచయం చేయబోతున్నాడా అనే అనుమానం ఈ ట్రైలర్ చూస్తే కలుగుతుంది. క్రిష్ కపూర్ అనే సింగర్ కు, వాణి అనే లిరిక్ రైటర్ కు మధ్య ఏర్పడి ప్రేమ ఎలా గాఢంగా వారి మధ్య బంధాన్ని పెంచింది, ఆ తర్వాత ఎలా వారు ఒకరికి ఒకరు దూరమయ్యారు అనేది ఈ ట్రైలర్ లో ఉంది. కొత్త నటీనటులే అయినా అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పద్దా (Aneet Padda) చాలా బాగా ఈ పాత్రలను చేశారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అలానే ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి సంగీతంతో ప్రాణం పోశారు. మరి 'రాక్ స్టార్, ఆషికీ -2' తరహాలో ఈ సినిమా విజయం సాధిస్తుందేమో చూడాలి.

Updated Date - Jul 08 , 2025 | 01:02 PM