Saiyaara: సైయారా కాంబో రిపీట్
ABN, Publish Date - Sep 02 , 2025 | 04:00 PM
హిట్ కాంబోలకు ఉండే క్రేజే వేరు. అందుకే చాలా మంది మేకర్స్ సక్సెస్ కొట్టడానికి దాన్ని షార్ట్‌కట్‌గా వాడుతుంటారు. తాజాగా బీటౌన్ లేటెస్ట్ క్రేజీ జంటతో మరో మూవీని సెట్ చేస్తున్నారన్న వార్తలు బాలీవుడ్‌ని హీటెక్కిస్తున్నాయి.
బీటౌన్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ సైయారా (Saiyaara). చిన్న ప్రాజెక్ట్‌గా వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా.. . బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ కొల్లగొట్టి... సంచలనం సృష్టించింది. ఈ మూవీలో హీరో అహాన్ పాండే (Ahaan Panday), హీరోయిన్ అనీత్ పద్దా (Aneet Padda) జోడీ ఓవర్‌నైట్ సెన్సేషన్స్ అయిపోయారు. వీళ్ల రొమాంటిక్ కెమిస్ట్రీ చూసి దేశమంతా ఫిదా అయిపోయింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వీళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే వీరు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.
బీటౌన్‌లో లేటెస్ట్ హాట్ గాసిప్ ఏంటంటే... ఈ 'సైయారా' జోడీ మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేయబోతోందట. రీసెంట్‌గా అహాన్, అనీత్, డైరెక్టర్ మోహిత్ సూరీ (Mohit Suri) కనిపించారట. దాంతో బాలీవుడ్ సర్కిల్స్‌లో కొత్త ప్రాజెక్ట్ గురించి గాసిప్స్ మొదలయ్యాయి. హీరో హీరోయిన్లు ఒకచోట కనిపించడం ఒకటైతే.. 'సైయారా'ని సూపర్ హిట్ చేసిన డైరెక్టర్ మోహిత్ సూరితో కలిసి కనిపించడంతో వీళ్ళు ఏదో బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ మొదలైంది.
'సైయారా'ను ప్రొడ్యూస్ చేసిన యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) సంస్థే ఈ సినిమానూ నిర్మిస్తుందని అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా... 'సైయారా' ఫ్యాన్స్ మాత్రం ఈ జోడీ మళ్లీ స్క్రీన్‌పై రొమాన్స్‌తో మ్యాజిక్ చేస్తుందని ఫుల్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. మోహిత్ సూరి అంటేనే రొమాంటిక్ సినిమాలకి పెట్టింది పేరు. సో ఈ కాంబో గనుక మళ్లీ సెట్ అయితే మరో హిట్ కొట్టడం పక్కా అని తేల్చేస్తున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందేమో చూడాలి.
Read Also: OG Craze Peaks: 'ఓజీ' ఒక్క టిక్కెట్ రూ.5 లక్షలు..
Read Also: The Bengal Files: మమతా బెనర్జీకి వివేక్ వేడుకోలు...