Raashii Khanna: దక్షిణాది చిత్రాల్లో హద్దులున్నాయ్
ABN, Publish Date - Dec 02 , 2025 | 08:45 AM
బాలీవుడ్‌తో పోల్చితే దక్షిణాది చిత్రాల్లో కొన్ని హద్దులు (బౌండరీస్) ఉన్నాయని ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నాఅభిప్రాయపడ్డారు.
బాలీవుడ్‌తో పోల్చితే దక్షిణాది చిత్రాల్లో కొన్ని హద్దులు (బౌండరీస్) ఉన్నాయని ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నాఅభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో సౌత్‌లో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో మళ్ళీ బాలీవుడ్ వైపు దృష్టిసారించారు. ఇదే విషయంపై రాశీఖన్నా స్పందిస్తూ, ‘దక్షిణాది చిత్రాలతో పోలిస్తే ఉత్తరాది చిత్రాల్లో సరిహద్దులు లేవు. సౌత్‌లో అనేక కమర్షియల్ చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పుడు హిందీలో ప్రవేశించేందుకు ఇదే సరైన తరుణం. కథ డిమాండ్ మేరకు అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
ALSO READ: Akkineni Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పోస్ట్ వైరల్
ముఖ్యంగా దక్షిణాదిలో కమర్షియల్ చిత్రాల్లో నటించడం ఇష్టమే అయినప్పటికీ ఇక్కడ నాకంటూ కొన్ని హద్దులున్నాయి. నటిగా ఈ హద్దులను దాటి నా ప్రతిభను నిరూపించుకుని, నాకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకోవాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఇటీవల రాశి కన్నా తెలుగులో 'తెలుసు కదా' చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఓ సినిమా, హిందీ లో రెండు చిత్రాలతో బిజీ గా ఉంది.
ALSO READ: Akhanda 2 Producers: బాలయ్య.. బోయపాటి అనుకుంటే ఏదైనా సాధ్యమే..
Samantha - Raj Nidimoru: సమంత పెళ్లి.. ఇంత కథ ఉందా
Samantha- Raj Marriage: బరితెగించిన వాళ్లు ఇలాగే చేస్తారు.. రాజ్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు