Akkineni Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పోస్ట్ వైరల్
ABN , Publish Date - Dec 01 , 2025 | 09:08 PM
నేడు సమంత (Samantha) - రాజ్ నిడిమోరు (Raj Nidimoru) పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో సింపుల్ గా జరిగిన విషయం తెల్సిందే. సామ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Akkineni Naga Chaitanya: నేడు సమంత (Samantha) - రాజ్ నిడిమోరు (Raj Nidimoru) పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో సింపుల్ గా జరిగిన విషయం తెల్సిందే. సామ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక సామ్ పెళ్లి తరువాత అందరూ ఆమెను ట్రోల్ చేస్తూ.. అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) మంచివాడని, ది ఫ్యామిలీ మ్యాన్ 2 నుంచే రామ్ - సామ్ కి రిలేషన్ ఉందని, అందుకే చై విడాకులు ఇచ్చాడని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా చై తమ విడాకుల గురించి మాట్లాడడం ఇంకా ఆపాలని, ఎవరి జీవితాలు వారు చూసుకున్నారని చేసిన వ్యాఖ్యలను కూడా మరోసారి వైరల్ చేస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. తాను నటించిన మొదటి వెబ్ సిరీస్ దూత రిలీజ్ అయ్యి రెండేళ్లు అయిన సందర్భంగా ఆ సిరీస్ ని హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. ' ఒక నటుడిగా ఎంతో సృజనాత్మకంగా.. నిజాయితీగా కథను ఎంచుకొని, ఉత్తమమైన నటనను కనబరిచినప్పుడు.. ప్రజలు కనెక్ట్ అవుతారు అని తెలిపిన సిరీస్ దూత. వారు ఆ ఎనర్జీని స్వీకరించి మళ్లీ తిరిగి ఆ నటుడికి అంతే ఎనర్జీని ఇస్తారు. దూత రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది. దీన్ని సాధ్యం చేసిన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం నాగ చైతన్య పోస్ట్ సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ఇక ఈ పోస్ట్ కింగ్ అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సమంత పెళ్లి గురించి మాట్లాడుతూ.. సమంత పెళ్ళికి వెళ్లలేదా.. వాళ్ళు పిలవలేదా అని కొందరు.. ఈరోజు చాలా బాగా గుర్తొచ్చావ్ బ్రో అని ఇంకొందరు.. సగం దరిద్రం వదిలింది అనుకో చై అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.