Bollywood: రణబీర్ - అలియా కొత్త ఇంటి విలువ తెలుసా...
ABN, Publish Date - Dec 06 , 2025 | 03:24 PM
బాలీవుడ్ స్టార్ కపూర్ రణబీర్ కపూర్, అలియా భట్ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టారు. సింపుల్ గా జరిగిన ఈ గృహప్రవేశం తాలుకూ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) తాజాగా తమ కొత్త ఇంటిలోకి అడుగు పెట్టారు. డిసెంబర్ 5న ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను అలియా భట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పాలి హిల్స్ రెసిడెన్సీ లోని 'కృష్ణరాజ్' బంగ్లాలో జరిగిన ఈ గృహప్రవేశం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. కొంత కాలంగా ఈ ఇంటి నిర్మాణం సాగుతూ వచ్చింది. దగ్గరుండి ఈ నిర్మాణాన్ని అలియా భట్ పర్యవేక్షిస్తూ వచ్చింది. మొత్తానికి తన మనసుకు నచ్చినట్టుగా అలియా భట్ ఏర్పాటు చేసుకున్న ఈ పొదరిల్లు విలువ రూ. 250 కోట్ల నుండి 400 కోట్ల మధ్య ఉండే ఆస్కారం ఉందని తెలుస్తోంది.
గృహ ప్రవేశం సందర్భంగా అలియాభట్ విడుదల చేసిన ఫోటోలలో ఆసక్తికరమైన దృశ్యాలను కాప్చర్ చేశారు. తన తండ్రి రిషీ కపూర్ (Rishi Kapoor) ఫోటోకు భక్తిశ్రద్ధలతో రణబీర్ కపూర్ నమస్కారం పెడుతున్న ఫోటో కపూర్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అలానే అలియాభట్ తన అత్తగారు నీతూ కపూర్ (Neetu Kapoor) ను ఆలింగనం చేసుకున్న ఫోటో గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఈ ఇంటిలోని ఫర్నీచర్ ట్రెండీగా ఉందని, అలానే కొన్ని సంప్రదాయ బద్ధంగానూ ఉండి, ఆకట్టుకుంటున్నాయని ఈ వేడుకలో పాల్గొన్నవారు చెబుతున్నారు. మరి ఎలాంటి హడావుడి, హంగామా లేకుండా కొత్త ఇంటిలోకి అడుగు పెట్టిన అలియా, రణబీర్ జంట తోటి బాలీవుడ్ స్టార్స్ కు గ్రాండ్ పార్టీని ఎప్పుడిస్తారో చూడాలి.
Also Read: The Raja Saab: ఓవర్సీస్‌లో ‘రాజాసాబ్’కు ఆ ఎఫెక్ట్స్ లేనట్టే
Also Read: Akhanda 2: ‘అఖండ 2’ వచ్చేది అప్పుడేనా.. బుక్ మై షో అప్డేట్