The Raja Saab: ఓవర్సీస్‌లో ‘రాజాసాబ్’కు ఆ ఎఫెక్ట్స్ లేనట్టే
ABN , Publish Date - Dec 06 , 2025 | 02:41 PM
టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఓవర్సీస్‌లో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ‘రాజాసాబ్’ రిలీజ్ అవ్వడం లేదని డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది
టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్(Prabhas), దర్శకుడు మారుతి (maruthi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Rajasaab). హారర్ కామెడీ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 2026 జనవరి 9వ తేదీన ఐమాక్స్ వెర్షన్‌తో సహా అన్ని ఫార్మాట్‌లలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. అందుకే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం టీజర్, గ్లింప్స్ ఐమ్యాక్స్‌లోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు జనాల దృష్టి అంతా ఐమాక్స్ వెర్షన్ మీదే ఉంది. ఓవర్సీస్‌లో మాత్రం ఆ ఫార్మెట్‌లో విడుదల కావడం లేదట.
ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ సంస్థ పోస్ట్ పెట్టింది. ఓవర్సీస్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్(Prathyangira Cinemas) ‘రాజాసాబ్’ను రిలీజ్ చేయనుంది. అయితే ఇప్పుడు ఓవర్సీస్‌లో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ‘రాజాసాబ్’ రిలీజ్ అవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘అవతార్ 3’, ఐమ్యాక్స్ మధ్య నాలుగు వారాలు ప్రత్యేక ఒప్పందం ఉండడమే అందుకు కారణమని వెల్లడించింది. అందుబాటులో ఉన్న అన్ని పీఎల్‌ఎఫ్(PLF), డీబాక్స్ (DBOX) ఇతర ఫార్మెట్‌లో సినిమా చూడాలని కోరింది. అయితే ఆ ఫార్మాట్‌లో కూడా నాలుగు వారాలపాటు ‘అవతార్ 3’తో ఒప్పందం చేసుకుని ఉన్నాయని, కానీ ఎప్పటిలాగే వీలైనన్ని ఎక్కువ ప్రత్యేక ఫార్మాట్ షోలను పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ప్రత్యంగీరా సంస్థ తెలిపింది. అవతార్ -3 డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. ‘రాజాసాబ్’ జనవరి 9వ తేదీన విడుదలవుతోంది. రెండింటికి మధ్య నాలుగు వారాల కన్నా తక్కువ గ్యాప్ ఉంది. కాబట్టి ఇప్పటికే అవతార్ మేకర్స్.. ఐమ్యాక్స్‌తో ఒప్పందం చేసుకోవడంతో రాజాసాబ్‌పై ఆ ఎఫెక్ట్ పడింది. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కావడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ఓవర్సీస్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.