Akhanda 2: ‘అఖండ 2’ వచ్చేది అప్పుడేనా.. బుక్ మై షో అప్డేట్

ABN , Publish Date - Dec 06 , 2025 | 10:10 AM

‘అఖండ 2’ (Akhanda 2) విడుదల వాయిదా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

‘అఖండ 2’ (Akhanda 2) విడుదల వాయిదా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus) నిర్మాతలు  విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షో యాప్‌లో అప్‌డేట్‌ మరో హాట్ టాపిక్ గా మారింది. ‘అఖండ 2’ కొత్త విడుదల తేదీపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోన్న వేళ.. బుక్‌ మై షో (Book My Show) ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు యాప్‌లో అప్‌డేట్‌ చేసింది. 

విడుదల ఎప్పుడు అనేది నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాబట్టి  అలా అప్‌డేట్‌ ఇచ్చిందా  లేదా సంక్రాంతి బరిలో రానున్నట్లు ఊహించి వచ్చే ఏడాది అని పబ్లిష్ చేసిందా అనేది  తెలియాల్సి ఉంది.  బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట  నిర్మించారు. డిసెంబర్‌ 5న విడుదల కావాల్సి ఉంది  రిలీజ్‌కు కొన్ని గంటల ముందు వాయిదా పడింది. తాజాగా నిర్మాత ఒక పోస్ట్‌ షేర్‌ చేశారు. త్వరలోనే బ్లాక్‌బస్టర్‌ తేదీతో వస్తామని అన్నారు.

  

ఆ మూడు తేదీలు.. ఆప్షన్ 

అఖండ 2 ఎట్టి పరిస్థితుల్లో ఈనెల‌లోనే విడుద‌ల కావాలి. సంక్రాంతికి  డేట్స్ దొరికే ఛాన్స్ లేదు.  అందుకే డిసెంబ‌రులో రావ‌డం తప్ప మ‌రో దారి లేదు. ఇందుకోసం అఖండ 2కి మూడు ఆప్ష‌న్లు ఉన్నాయి. డిసెంబ‌రు 12,  19, 25 తేదీలు. డిసెంబ‌రు 12న‌.. మీడియం సినిమాలు జోరుగా రాబోతున్నాయి. అఖండ వ‌స్తే, ఆ సినిమాలకు ఇబ్బంది కలుగుతుంది.  డిసెంబ‌రు 19న అవతార్ 3 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అవ‌తార్ 3  ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మిగిలిన చోట అవ‌తార్ 3 ఎఫెక్ట్ గ‌ట్టిగా ఉంటుంది.  ఓవ‌ర్సీస్‌లో థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్టం  ఇవన్నీ ఆలోచిస్తే  బెస్ట్ ఆప్ష‌న్ డిసెంబ‌రు 25 మాత్రమే కనిపిస్తుంది. 

Updated Date - Dec 06 , 2025 | 10:47 AM