Rakesh Roshan: హృతిక్ పాటకు తండ్రి రోషన్ స్టెప్పులు
ABN , Publish Date - Aug 07 , 2025 | 06:01 PM
స్టార్ హీరోస్ సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. డైలాగ్స్ నుంచి డ్యాన్స్ ల వరకూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా సిగ్నేచర్ స్టెప్పులతో రీల్స్ చేస్తుంటారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇప్పుడు హీరోస్ ఫ్యామిలీ మెంబర్స్ సైతం చిందులేయడం హట్ టాపిక్ గా మారింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే బిగ్ స్టార్లకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అభిమానులు ఉంటారు. పైగా తమ అభిమాన హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు... సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేంత వరకు తెగ హడావుడి చేస్తుంటారు. స్టిల్స్ ను , టీజర్లను షేర్స్ చేస్తూ సొషల్ మీడియాలో కావాల్సినంత హైప్ క్రియేట్ చేస్తుంటారు. రిలీజ్ తర్వాత తమ హీరో ఇన్ని కోట్లు కలెక్ట్ చేశాడంటూ తెగ ఖుషి అవుతుంటారు. ఇక హీరోల పెర్ఫార్మెన్స్ తో పాటు డైలాగ్స్, సాంగ్స్ లను రీల్స్ చేస్తూ నానా హంగామా చేస్తుంటారు. అయితే అభిమానులే కాదు.. స్టార్ల తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలపై ప్రేమను చాటుకోవడం కోసం చిందులు వేస్తున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) తల్లిదండ్రులు 'వార్ 2' (War2) సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ 2' ఆగస్ట్ 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ సినిమా పై అంచనాలను పెంచింది. ఓ వైపు సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్. త్వరలో హైదరాబాద్ లో భారీ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు హృతిక్ రోషన్ పేరెంట్స్ తమవంతు ప్రమోషన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మొన్నటికి మొన్న హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కొడుకు 'వార్ -2'లోని మెలోడీ సాంగ్ 'ఆవన్ జావన్'కు అదిరిపోయే స్టెప్పులేసి వావ్ అనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేయగా... ఇప్పుడు తండ్రి రాకేష్ రోషన్ కాలు కదిపాడు. కొంత మంది పిల్లలతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. కొడుకు పాటకు అదిరిపోయే స్టెప్పులేశారంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో ట్రెండింగ్ లో నిలిచింది.