War2: ఎన్టీఆర్‌ను.. డామినేట్ చేసిన కియారా! నేషనల్ వైడ్ ట్రెండింగ్
ABN , Publish Date - May 20 , 2025 | 04:26 PM
జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం బాలీవుడ్ ఆరంగేట్ర చిత్రం వార్2 నుంచి టీజర్ రిలీజ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జన్మదినం సందర్భంగా మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు హంగామా చేస్తూ వివిధ కార్యక్రమాలు చేస్తూ బర్త్‌డేను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈక్రమంలోఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు జూనియర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా మారు మ్రోగుతోంది. అదేవిధంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల లుక్స్‌తో పాటు బాలీవుడ్ ఆరంగేట్ర చిత్రం వార్2 (War2 Teaser) నుంచి ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు.
అయితే వీటన్నింటిలో వార్2 టీజర్ (War2 Teaser) ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోండగా దేశ వ్యాప్తంగా మిక్స్‌డ్ టాక్ దక్కించుకుంటోంది. YRF స్పై యూనివర్స్‌లో (YRF Spy Universe)లో భాగంగా ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ (Yash Raj Films) నిర్మించగా బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు.
మరోవైపు ఇటు ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ , అటు హృతిక్ (Hrithik Roshan) ఫ్యాన్స్ తమ హీరోలకు ఇచ్చిన ఎలివేషన్ గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఓ పక్క హీరోల పర్సనాలిటీ ని కంపైర్ చేస్తూ ట్రోలింగ్ కూడా నడుస్తొంది.
అయితే.. ఇదంతా ఇలా ఉంటే అటు హృతిక్ రోషన్‌ను కాదని, ఎన్టీర్‌ను కాదని టీజర్‌లో రెండు మూడు సెకన్లు మాత్రమే మెరుపు తీగలా కనిపించి మాయమైన కియరా అద్వానీ (Kiara Advani) వీడియోపై ఇప్పుడు అందరి దృష్టి పడి దానిపైనే ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. టూ పీస్ బికినీలో కియారా అద్వాని (Kiara Advani) హట్ లుక్ మాత్రం అదిరిపోయిందంటూ.. ఆమె ఫోటోలను, వీడియోను అదే పని ఒకటికి రెండు సార్లు రిపీట్ చేసి చూస్తూ ఆస్వాదిస్తున్నారు నెటిజన్స్.
ఇప్పుడు కియారేనే సామాజిక మాధ్యమాల్లో నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతుంది. దీంతో జూనియర్ (Jr NTR) జన్మదినం నాడు వార్2 టీజర్ దుమ్ములేపి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రీట్ ఇస్తుందనుకుంటే అది కాస్త రివర్స్ అయి వార్2 (War2 Teaser)ను డామినేట్ చేస్తూ కియారా హైలెట్ అయింది.
ఇదిలాఉంటే.. ఇప్పటికే తెలుగులో మహేశ్‌బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్‌తో వినయవిధేయ రామ, గేమ్ చేంజర్ చిత్రాల్లో నటించిన కియారా (Kiara Advani) తెలుగు వాళ్లకు సుపరిచితమే. అర్జున్ రెడ్డి హిందీ రిమేక్ కబీర్‌తో బాలీవుడ్‌లో బిజీ అయిన కియారా అక్కడ వరుస చిత్రాలతో దూసుకుపోయింది. రెండేండ్ల క్రితం తన సహా నటుడు ఆగ్ర హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుని సెటిల్ అయింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కియారా త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది.