War2: హృతిక్ రోష‌న్‌, జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్.. వార్ 2 విడుదల తేదీ ఫిక్స్

ABN , First Publish Date - 2023-11-29T11:58:13+05:30 IST

ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమా వార్‌ 2. YRF స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా 6వ చిత్రంగా వ‌స్తున్న ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

War2: హృతిక్ రోష‌న్‌, జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్.. వార్ 2 విడుదల తేదీ ఫిక్స్
war 2

అనుకున్నంత అయింది ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమా వార్‌2 విడుద‌ల మరింత ఆలస్యం కానుంది. YRF స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా 6వ చిత్రంగా వ‌స్తున్న ఈ సినిమాను 2025 ఆగ‌ష్టు 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

బ్ర‌హ్మ‌స్త సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అయాన్ ముఖ‌ర్జీ ఈ వార్‌2 సినిమాను డైరెక్టు చేస్తుండ‌గా హృతిక్ రోష‌న్‌, జూ.ఎన్టీఆర్ వంటి బిగ్ స్టార్స్ న‌టిస్తుండడంతో ీ సినిమాపై బాలీవుడ్ లోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.


2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ వాణి కపూర్ ప్రధాన తారాగణంగా వచ్చిన వార్ కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఇప్పటికే స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్కడ యాక్షన్ సన్నివేశాలు, కార్ ఛేజింగ్ వంటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ముందుగా 2025 జనవరి 26 న విడుదల సినిమాను విడుదల చేద్దామని భావించినప్పటికీ లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందనే ఉద్ధశంతో ఇండిపెండెన్స్ డే ముందు రోజు సినిమా విడుదలకు ఓకే చెప్పినట్టు సమాచారం.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం దేవర షూటింగ్ లో బిజీగా ఉండగా 2024లో విడుదల కానుంది. హృతిక్ నటించిన ఫైటర్ చిత్రం షూటింగ్ పూర్తవగా 2024 జనవరిలో విడుదల కానుంది.

Updated Date - 2023-11-29T12:23:29+05:30 IST