Nagarjuna Defamation Case: అవమానానికి గురయ్యాం.. పరువు నష్టం దావా కేసులో నాగార్జున తుది వాంగ్మూలం
ABN , Publish Date - Sep 04 , 2025 | 06:14 AM
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో అక్కినేని నాగార్జున తుది వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం నాగార్జున తన కొడుకు నాగచైతన్యతో కలసి నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్...
పరువు నష్టం దావా కేసులో నాగార్జున తుది వాంగ్మూలం
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో అక్కినేని నాగార్జున తుది వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం నాగార్జున తన కొడుకు నాగచైతన్యతో కలసి నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. సురేఖ తమ కుటుంబంపై చేసిన అభ్యంతరకర, నిరాధార వ్యాఖ్యలతో తమకు తీవ్రమైన అవమానం జరిగిందని, మనోవేదనకు లోనయ్యామని నాగార్జున పేర్కొన్నారు. తన వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలకు సంబంధించి ఛానెల్స్‌లో ప్రసారమైన వీడియోలు, పత్రికల్లో వచ్చిన కథనాలను నాగార్జున కోర్టులో సమర్పించారు. ఈనెల 24 నుంచి ఈ కేసు ట్రయల్ ప్రారంభమవనుంది. తదుపరి విచారణలో నాగార్జునను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి)