Lokesh Kanagaraj: అనిరుధ్ సంగీతంపై అంత నమ్మకం ఏంటో..
ABN , Publish Date - Sep 04 , 2025 | 08:49 AM
సంగీత దర్శకుడు అనిరుద్ పై దర్శకుడు లోకేష్ కనకరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు
భవిష్యత్‌లో ఏ సినిమా కూడా అనిరుధ్ (Anirudh) సంగీతం లేకుండా తీయనని, ఒక వేళ అనిరుధ్ చిత్రపరిశ్రమ నుంచి వైదొలగితే మరో సంగీత దర్శకుడు లేదా కృత్రిమ మేథ కోసం ఆలోచన చేస్తానని ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) స్పష్టం చేశారు. తాజాగా కోవైలో జరిగిన ఒక కాలేజీ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘కూలీ’ (Coolie) ఒక టైమ్ ట్రావెల్ మూవీ. ఎల్.సి.యు అని నేను ఎన్నడూ చెప్పలేదు. ప్రేక్షకులే అలా ఊహించుకున్నారు. సుమారు 18 నెలల పాటు సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని నేను కథలు సిద్ధం చేయను. కథ రాస్తాను, అది వారికి నచ్చాలని ఆశిస్తాను. ఒక వేళ వారి అంచనాలను అందుకోలేకపోతే మళ్ళీ ప్రయత్నిస్తాను. ‘కూలీ’ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో రజనీకాంత్ నటించారు. వాటిని డీ-ఏజింగ్ చేశాం. ఆ సన్నివేశాల్లో వినిపించే రజనీ వాయిస్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేయడం జరిగింది. రూ.కోట్లు రాబట్టే సినిమాలు చేయడమే సక్సెస్ కాదు. ఎంత నిడివున్న చిత్రమైనా మనం అనుకున్న కథను అనుకున్నట్టుగా ప్రేక్షకులకు చెబితే దర్శకుడిగా విజయవంతమైనట్టే. బాక్సాఫీస్ లెక్కలు నిర్మాతలకే. వాటితో దర్శకులకు పనిలేదు’ అని పేర్కొన్నారు.