సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mastiii 4: ఓజీ బాయ్స్ రీ-యూనియన్...

ABN, Publish Date - Sep 23 , 2025 | 01:23 PM

విడుదలైన రితీశ్‌ దేశ్‌ ముఖ్‌, వివేక్ ఓబెరాయ్, అఫ్తాబ్ శివదాసానీ మస్తీ 4 టీజర్. నవంబర్ 21న విడుదల కాబోతున్న 'మస్తీ 4' మూవీ.

Mastiii4 Movie

బాలీవుడ్ లో ఫ్రాంచైజెస్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి తాజా ఉదాహరణ 'మస్తీ -4'. ఓజీ బాయ్స్ రితీష్‌ దేశ్ ముఖ్, వివేక్ ఓబెరాయ్, అఫ్తాబ్ శివాదాసానీ 'మాస్తీ -4' కోసం మరోసారి కలిశారు. ఈ యేడాది నవంబర్ 21న విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. మెయిల్ లీడ్ క్యారెక్టర్స్ చేసిన రితీష్, వివేక్, అఫ్తాబ్ తో పాటు ఈ టీజర్ లో హీరోయిన్లు శ్రేయా శర్మ, ఎల్నాజ్ నౌరోజీ, రుహీ సింగ్ లనూ పరిచయం చేశారు. ఇందులో హీరోలు 'మస్తీ' ముందు చిత్రాలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. 'పహ్లే కీ మస్తీ, ఫిర్ హుహీ గ్రాండ్ మస్తీ, ఫిర్ గ్రేట్ గ్రాండ్ మస్తీ, అబ్ హోగీ మస్తీ ఫోర్' అంటూ వారితో చెప్పించారు. ఇస్ బార్ 4 ఎక్స్ సైతానీ, 4 ఎక్స్ దోస్తీ ఔర్ 4 ఎక్స్ కామెడీ బ్లాస్ట్.... అని మేకర్స్ ప్రకటించారు.


'మస్తీ' ఫ్రాంచైజ్ లో తొలి చిత్రం 2004లో వచ్చింది, 2013లో దాని సీక్వెల్ గా 'గ్రాండ్ మస్తీ'ని తీశారు. ఆ తర్వాత మూడేళ్ళకు అంటే 2016లో 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'ని తెరక్కించారు. ఇప్పుడు తొమ్మిదేళ్ళ తర్వాత 'మస్తీ -4'ను రూపొందించారు. మొదటి మూడు చిత్రాలకు ఇంద్రకుమార్ దర్శకత్వం వహించగా, ఇప్పుడీ ఫ్రాంచైజ్ ను 'సత్యమేవ జయతే, మర్జావాన్' ఫేమ్ మిలప్ మిలన్ జవేరీ డైరెక్ట్ చేశాడు. 2013లో వచ్చిన 'గ్రాండ్ మస్తీ' మూవీ అప్పట్లో 'ఏ రేటెడ్' మూవీస్ తో రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే గత కొంతకాలంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో తెరకెక్కుతున్న ఈ తరహా మూవీస్ ను ప్రేక్షకులు ఆదరించడం మానేశారు. మరి 'మస్త్ 4'కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

Also Read: Janhvi Kapoor : ‘మేరా దేశ్‌ పహ్లే' ప్రీమియర్‌లో జాన్వీకపూర్‌

Also Read: Shah Bano: యామీ గౌతమ్ నట విశ్వరూపం 'హక్'

Updated Date - Sep 23 , 2025 | 01:30 PM