Janhvi Kapoor : ‘మేరా దేశ్‌ పహ్లే' ప్రీమియర్‌లో జాన్వీకపూర్‌

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:21 PM

భారత ప్రధాని నరేంద్రంమోదీపై (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor).

భారత ప్రధాని నరేంద్రంమోదీపై (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌(Janhvi Kapoor). ఆయన నిర్ణయాలు అందరికీ స్ఫూర్తినిస్తాయని ఆమె పేర్కొన్నారు. ముంబయిలో జరిగీన ‘మేరా దేశ్‌ పహ్లే: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ శ్రీ నరేంద్రమోదీ’ (Mera Desh Pehle:The Untold Story of Shri Narendra Modi) ప్రీమియర్‌లో  పాల్గొన్న జాన్వీకపూర్‌.. మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ కాన్సర్ట్‌ను నిర్వహించారు.

జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ ‘ఈ వేదికపై నేనూ ఉండటం చాలా ఆనందంగా ఉంది. మన దేశంలో ఉన్న అందరికీ  మోదీ కథ గురించి తెలుసు. కానీ, ఒక నటిగా ఈ ఈవెంట్‌కు రావడం, ఆయన కథ వినడం నాకు చాలా సంతోషంగా ఉంది. మోదీ జీవితం, ఆయన దేశం కోసం తీసుకొనే నిర్ణయాలు అన్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన చేసే ప్రతి పని అందరికీ స్ఫూర్తినిస్తుంది’ అని జాన్వీకపూర్‌ అన్నారు.


‘మేరా దేశ్‌ పహ్లే: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ శ్రీ నరేంద్రమోదీ’ విషయానికొస్తే.. ప్రముఖ రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ ఈ కాన్సర్ట్‌ను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన బాల్యం నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన తీరును పాట రూపంలో రూపొందించారు. ముంబయిలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read: Film Awards: జాతీయ సినిమా అవార్డుల ప్రదానం

Also Read: Pawan Kalyan: 'ఎ' సర్టిఫికెట్ ప్రభావం 'ఓజీ'పై పడుతుందా...

Updated Date - Sep 23 , 2025 | 12:55 PM