సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Girija Oak: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గిరిజ ఓక్.. ఎవరీమె

ABN, Publish Date - Nov 10 , 2025 | 06:23 PM

వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్.. స్కై బ్లూ చీర.. అందమైన రూపం.. ఎగిరే కురులతో ఒక నటి ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Girija Oak

Girija Oak: వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్.. స్కై బ్లూ చీర.. అందమైన రూపం.. ఎగిరే కురులతో ఒక నటి ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యేవారికి కచ్చితంగా ఆ ఫోటో కనిపించే ఉంటుంది. అసలు ఆమె ఎవరు.. ? ఎందుకు ట్రెండ్ అవుతుంది.. ? ఏంటి అనేది చాలామందికి తెలియదు. కానీ, ఆ నటి గురించి తెలుసుకోవడానికి మాత్రం సెర్చింగ్ మొదలుపెట్టారు. ఆమె ఎవరో కాదు మరాఠీ నటి గిరిజ ఓక్(Girija Oak). సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతారో ఎవ్వరూ చెప్పలేరు. గిరిజ కూడా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల వలన ట్రెండ్ అయ్యింది. మళ్ళీ అవేమి కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు కూడా కాదు. ఆమె ఏం చెప్పింది.. ? ఎవరి గురించి చెప్పింది అనేది తెలుసుకుందాం.

గిరిజ ఓక్ ఒక మరాఠీ నటి. హిందీలో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తారే జమీన్ పర్, షోర్ ఇన్ ది సిటీ, జవాన్, ఇన్స్పెక్టర్ జెండే లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేనా పాపులర్ యాడ్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం గిరిజ థెరఫీ షెరఫీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. గుల్షన్.. ఈ మధ్యనే కాంతార చాప్టర్ 1 లో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు.

ఇక ఒక ఇంటర్వ్యూలో గిరిజ.. గుల్షన్ గురించి చెప్పుకొచ్చింది. ' సాధారణంగా రొమాంటిక్ సీన్స్ సమయంలో అమ్మాయిలకు ఇబ్బంది ఉంటుంది. ఆ సీన్ చేసేటప్పుడు అక్కడ చాలామంది ఉంటారు. కానీ, ఎవరు అమ్మాయిల ఇబ్బందిని పట్టించుకోరు. అయితే ఈ సిరీస్ లో ఒక సీన్ ఉంటుంది. అదేమీ అంత ఇబ్బందికరంగా లేదు.. అయినా కూడా గుల్షన్.. 16, 17 సార్లు మీరు ఓకేనా.. మీరు ఓకేనా అని అడిగాడు. ఆ కేరింగ్ నాకు బాగా నచ్చింది' అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. గిరిజ ఫోటోలు ట్రెండింగ్ లోకి పోయి అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి ఈ ట్రెండ్ ఈ మరాఠీ బ్యూటీకి తెలుగులో కూడా అవకాశాలను తీసుకొచ్చిపెడుతుందేమో చూడాలి.

Priyanka Chopra: ఇక్కడే ఎందుకు ఉంటున్నానో ఆ రోజు తెలుస్తుంది 

Santhana prapthirasthu: ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని రిజెక్ట్ చేశారు.. 

Updated Date - Nov 10 , 2025 | 07:06 PM