Santhana prapthirasthu: ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని రిజెక్ట్ చేశారు.. 

ABN , Publish Date - Nov 10 , 2025 | 06:09 PM

ఈ కథను కొందరు పేరున్న హీరోలకు చెప్పాం. స్పెర్మ్ కౌంట్ తక్కువ అన్న అంశం వల్ల వారి ఇమేజ్ కు ఇబ్బంది అవుతుందని రిజెక్ట్ చేశారు. కొత్త హీరోతో అయితే బెస్ట్ అని,  ఇమేజ్ గొడవలు ఉండవని విక్రాంత్ ని తీసుకున్నాం.


'ఈ కథను కొందరు పేరున్న హీరోలకు చెప్పాం. స్పెర్మ్ కౌంట్ తక్కువ అన్న అంశం వల్ల వారి ఇమేజ్ కు ఇబ్బంది అవుతుందని రిజెక్ట్ చేశారు. కొత్త హీరోతో అయితే బెస్ట్ అని,  ఇమేజ్ గొడవలు ఉండవని విక్రాంత్ ని (Vikranth) తీసుకున్నాం. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ స్టార్ గా ఎదిగాడు. మనవాళ్లు కూడా ఆయనలా ప్రయత్నించవచ్చు' అని మధుర శ్రీధర్ అన్నారు.
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'(Santhana Prapthirastu).  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. సంజీవ్ రెడ్డి  దర్శకుడు. ఈ నెల 14న రిలీజ్ కు రెడీ అవుతోంది. నిర్మాతలు మాట్లాడారు. 

మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ..

'నేను, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి పదేళ్లుగా కలిసి జర్నీ చేస్తున్నాం. నేను నిర్మించిన 'లేడీస్ అండ్ జెంటిల్ మేన్'కు రైటర్ గా పనిచేశాడు. ఆ సినిమాకు అప్పటి ఏపీ ప్రభుత్వ నంది పురస్కారాల్లో తృతీయ ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ ఎడిటర్ గా నవీన్ నూలికి అవార్డ్ వచ్చింది. అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ దర్శకత్వంలో ఏబీసీడీ రూపొందించాం. సంజీవ్ 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఈ స్క్రిప్ట్ ను సంజీవ్ బాగా హ్యాండిల్ చేశారు. మేము 50 రోజులు షూటింగ్ అనుకుంటే ఆల్ మోస్ట్ అనుకున్నది అనుకున్నట్లే చిత్రీకరణ జరుపుతూ వెళ్లాడు. మొత్తం 56 షూటింగ్ పూర్తి చేశాం.


మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సినిమా ఉన్నా, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఎంటర్ టైనింగ్ గా సినిమా ఉంటుంది. కామెడీ ఎక్కడా ఇరికించినట్లు ఉండదు. ఆర్గానిక్ గా ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ ఎంటర్ టైన్ మెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఫన్ క్రియేట్ చేశాం. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్..ఇలా కాస్టింగ్ అంతా మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తారు. స్క్రిప్ట్ వరకే నేను ఇన్వాల్వ్ అయ్యాను. డైరెక్షన్ మొత్తం సంజీవ్ చూసుకున్నాడు. మంచి లవ్ స్టోరీ, ఎమోషన్ ఉన్న క్లీన్ ఎంటర్ టైనింగ్ మూవీ మాది. సామజవరగమన తర్వాత మళ్లీ తెలుగులో వస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వవ సినిమా. 

ఫెర్టిలిటీ ఇష్యూస్ తో బాధపడుతున్న వారికి ఈ సినిమా ధైర్యం వస్తుంది. మంచి మెసేజ్ చేరుతుంది. మనం ఈ సమస్య కోసమా ఇంత బాధపడింది అనుకుంటారు. మొదట్లో ఏంటీ టైటిల్ అనుకునేవారు కూడా ట్రైలర్ రిలీజ్ అయ్యాక  టైటిల్ బాగుంది అంటున్నారు. స్క్రిప్ట్ దశలో నాకు, సంజీవ్ కు ఫస్ట్ వచ్చిన టైటిల్ సంతాన ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని ముందుగా టైటిల్ అనుకున్నా, అది లెంగ్తీగా ఉందని  ఇది  ఫిక్స్ చేశాం. అయితే ఈ సమస్య సీక్రెట్ గా చర్చించుకునేది  కాదు. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. మన సొసైటీలో ఉన్న ఈ సమస్య గురించి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో 'సంతాన ప్రాప్తిరస్తు 2' చేయాలనుకుంటున్నాం. సంతాన ప్రాప్తిరస్తు లాంటి చిన్న సినిమా దాదాపు 300 థియేటర్స్ లో రిలీజ్ అవుతోందంటే ట్రైలర్ ఆకట్టుకోవడం వల్లే. డిజిటల్ బిజినెస్ కూడా కంప్లీట్ చేసుకోగలిగాం.  యూఎస్ లో దాదాపు 200 లొకేషన్స్ లో పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. 

'నేల విడిచి సాము చేయడం నాకు ఇష్టం ఉండదు. 'సంతాన ప్రాప్తిరస్తు' తెలుగులో మంచి విజయం సాధించాక, ఆ క్రెడిబిలిటీతో  పాన్ ఇండియాకు రీచ్ అవుతుంది. నాకు పెద్ద సినిమాల కంటే చిన్న చిత్రాలను నిర్మించడమే కంఫర్ట్ గా ఉంటుంది. కంటెంట్ బేస్డ్ గా సాగే క్యూట్ మూవీ ఇది. హానెస్ట్ గా అటెంప్ట్ చేశాం. ఇష్యూ బేస్డ్ కథ అయినా ఎంటర్ టైన్ మెంట్ తో వెళ్తూ ఆకట్టుకుంటుంది. ఫిలిం మేకింగ్ లో అందరం తప్పులు చేస్తాం. కానీ కథ ఎంచుకునే విధానంలోనే ఆ  ఫిలింమేకర్ ఇంటెన్షన్ తెలుస్తుంది. వారి ప్రయత్నంలో నిజాయితీ ఉందని అనిపిస్తే సపోర్ట్ చేయండి. సంతాన ప్రాప్తిరస్తు" రిలీజ్ అయ్యాక, ఆనంద్ దేవరకొండ 'డ్యూయెట్' సినిమా బ్యాలెన్స్  షూట్ కంప్లీట్ చేస్తాం. 12 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత నెక్ట్స్ ఇయర్ నా డైరెక్షన్ లో మూవీ గురించి ప్లాన్ చేస్తా.  


నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ  

ఈ సినిమా ఐటీ ఎంప్లాయ్ నేపథ్యంగా ఉంటుంది కాబట్టి మా ఫ్రెండ్స్ అంతా బాగా రిలేట్ అవుతున్నారు. ట్రైలర్ వాళ్లకు బాగా నచ్చింది. సెన్సబుల్ ఇష్యూను, సెన్సిటివ్ గా చూపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఈ సినిమాను ప్రారంభించాం. మేల్ ఫెర్టిలిటీ ఇష్యూతో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎక్కడా అసభ్యత లేకుండా, ఎవర్నీ విమర్శించకుండా, హద్దులు దాటకుండా, బలమైన కథతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నిర్మించాం.
 

Updated Date - Nov 10 , 2025 | 06:10 PM