Katrina Kaif: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన కత్రీనా..

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:17 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నాళ్ళ నుంచో వస్తున్న రూమర్స్ కు విక్కీ కౌశల్ (Vicky Kaushal)దంపతులు చెక్ పెట్టారు. గత కొంతకాలంగా విక్కీ భార్య, స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ (Katriana Kaif) ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న విషయం విదితమే.

Katrina Kaif

Katrina Kaif: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నాళ్ళ నుంచో వస్తున్న రూమర్స్ కు విక్కీ కౌశల్ (Vicky Kaushal)దంపతులు చెక్ పెట్టారు. గత కొంతకాలంగా విక్కీ భార్య, స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ (Katriana Kaif) ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న విషయం విదితమే. కానీ, ప్రతిసారి కత్రీనా కానీ, విక్కీ కానీ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. కానీ గత నెల నుంచి కత్రీనా ప్రెగ్నెంట్ అని, అందుకే బయట కనిపించడం లేదని పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ, ఈసారి మాత్రం విక్కీ కూడా స్పందించకపోవడంతో నిజంగానే క్యాట్.. తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి.


ఇక ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ కత్రీనా - విక్కీ.. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నట్లు అధికారికంగా తెలిపారు. క్యాట్ బేబీ బంప్ ను పట్టుకొని మురిసిపోతున్న విక్కీ ఫోటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. 'ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో మరియు ఆనందంతో మా జీవితాల్లో ఉత్తమా అధ్యాయాన్నీ ప్రారంభించే మార్గంలో ఉన్నాం' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా విక్కీ - క్యాట్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఇక కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్ కొన్నేళ్లు డేటింగ్ చేసి 2021 లో వివాహం చేసుకున్నారు. ఇక దాదాపు నాలుగేళ్ల తరువాత కత్రీనా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఇక వీరి పెళ్లి తరువాత విక్కీ వరుస విజయాలను అందుకుంటూనే వస్తున్నాడు. ముఖ్యంగా ఛావా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపును అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో విక్కీ బిజీగా ఉన్నాడు.

Janhvi Kapoor : ‘మేరా దేశ్‌ పహ్లే' ప్రీమియర్‌లో జాన్వీకపూర్‌

Shah Bano: యామీ గౌతమ్ నట విశ్వరూపం 'హక్'

Updated Date - Sep 23 , 2025 | 01:17 PM