సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raakh: ‘పాతాళ్‌లోక్‌’ దర్శకుడి నుంచి క్రైమ్‌ థ్రిల్లర్‌

ABN, Publish Date - Aug 18 , 2025 | 03:52 PM

అమెజాన్‌ ప్రైమ్‌ (Prime video) వీడియో ఓటీటీ సరికొత్త వెబ్‌సిరీస్‌లతో వీక్షకులను అలరిస్తుంది. తాజాగా మరో ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను ప్రకటించింది.


అమెజాన్‌ ప్రైమ్‌ (Prime video) వీడియో ఓటీటీ సరికొత్త వెబ్‌సిరీస్‌లతో వీక్షకులను అలరిస్తుంది. తాజాగా మరో ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను ప్రకటించింది. ‘మీర్జాపూర్‌’ నటుడు అలీ ఫజల్‌ (Ali Fazal) కీలక పాత్రలో రూపొందుతున్న సిరీస్‌ ‘రాఖ్‌’ (Raakh). క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో సోనాలి బింద్రే(Sonali Bendre), ఆమిర్‌ బషీర్‌ నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను అనూష నందకుమార్‌, సందీప్‌ సాకేత్‌లతో కలిసి ‘పాతాళ్‌లోక్‌’ సిరీస్‌ దర్శకుడు ప్రొసిత్‌ రాయ్‌ తీస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది  అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా  స్ట్రీమింగ్  రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ వేదిక ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతే కాదు, ‘బూడిద నుంచి న్యాయం బయటకు వస్తుంది’ అని పేర్కొంది.

ఈ సందర్భంగా దర్శకులు నందకుమార్‌,  సాకేత్‌ల విజన్‌ను ప్రొసిత్‌ రాయ్‌ ప్రశంసించారు. శక్తివంతమైన కథను ప్రేక్షకులకు చెబుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నార్థకంగా మారిన న్యాయం, నైతికతలు వెలుగులోకి తీసుకురావడంతో పాటు, ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించేలా కథ, కథనాలతో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇదొక సాహసవంతమైన అడుగని ప్రొసిత్‌ అన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 03:54 PM