సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Inspector Zende: బికినీ కిల్లర్.. కరుడుగట్టిన నేరస్థుడు చార్లెస్ శోభరాజ్ ను పట్టుకున్న పోలీస్ కథ

ABN, Publish Date - Sep 06 , 2025 | 04:11 PM

చార్లెస్ శోభరాజ్ (Charles Sobhraj).. చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది. అతనొక కరుడుగట్టిన నేరస్థుడు. ఆడవారిని అతికిరాతకంగా చంపిన కిల్లర్.

Inspector Zende

Inspector Zende: చార్లెస్ శోభరాజ్ (Charles Sobhraj).. చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది. అతనొక కరుడుగట్టిన నేరస్థుడు. ఆడవారిని అతికిరాతకంగా చంపిన కిల్లర్. దొంగతనాలకు ప్రసిద్ది. అందుకే చాలామంది దొంగతనాలు చేసి దొరికిపోతే నువ్వేమైనా చార్లెస్ శోభరాజ్ వి అనుకుంటున్నవా అంటూ చెప్పుకోస్తారు. అంతటి కరుడుగట్టిన నేరస్థుడును రెండుసార్లు పట్టుకొని జైల్లో ఊచలు లెక్కేసేలా చేసింది ఒక ఇండియన్ పోలీస్.. ఆయనే మధుకర్ బాపురావ్ జెండే (Madhukar Bapurao Zende). ఆయన కథే ఇప్పుడు సిరీస్ గా వచ్చింది.


గోవాలో చార్లెస్ శోభరాజ్ ను జెండే, ఆయన టీమ్ ఎలా పట్టుకున్నారు.. ? అప్పుడు అసలు ఏం జరిగింది.. ? అనేది క్లియర్ గా ఇన్స్పెక్టర్ జెండే సిరీస్ లో చూపించారు. ఇందులో జెండేగా బాలీవుడ్ స్టార్ హీరో మనోజ్ భాజ్ పాయ్ నటించగా.. చార్లెస్ శోభరాజ్ గా జిమ్ సర్భ్ నటించాడు. ఈ సినిమాకు చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వం వహించి, రచించారు మరియు జే శేవక్రమణి మరియు ఓం రౌత్ నిర్మించారు.. ఈ సినిమా సెప్టెంబర్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.


కథ విషయానికొస్తే.. ఎన్నో హత్యలు, దొంగతనాలు, మోసాలు చేసి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కార్ల్స్ భోజ్ రాజ్.. 1986 మార్చిలో తన పుట్టినరోజు అని చెప్పి.. పాయసం తయారుచేసి అందులో మత్తుమందు కలిపి.. వారికి పెట్టి.. స్పృహ కోల్పోయేలా చేసి అక్కడి నుంచి మరో నలుగురు ఖైదీలతో తప్పించుకొని ముంబైకి వస్తాడు. అంత కరుడుగట్టిన నేరస్థుడు పారిపోవడంతో అప్పటి ప్రభుత్వంపై ప్రెషర్ పడుతుంది. దీంతో అతనిని పట్టుకోనే పని ముంబై పోలీస్ అయిన మధుకర్ జెండేకు అప్పగిస్తారు. కార్ల్స్ ని పట్టుకోవడానికి జెండే ఏం చేశాడు.. ? ఎంత దూరం వెళ్లాడు.. ? గోవాలో అతనిని ఎలా పట్టుకునాడు అనేది సినిమాలో చూడాల్సిందే.


చార్లెస్ శోభరాజ్ కెరీర్ లో ఈ అరెస్ట్ అత్యంత కీలకమైంది. రెండుసార్లు జెండే చేతిలో శోభరాజ్ అరెస్ట్ అయ్యాడు. తీహార్ నుంచి బయటకు వచ్చిన 15 రోజుల్లో శోభరాజ్.. ఒక హత్య చేశాడు. అది కూడా పాస్ పోర్ట్ కోసం.. ఆ మర్డర్ అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. దాదాపు 33 హత్యలు చేసిన శోభరాజ్ ను పట్టుకున్నందుకు జెండేను రాజీవ్ గాంధీ స్వయంగా కలిసి ప్రశంసించారు. ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న మొట్ట మొదటి పోలీస్ ఆయనే. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఇప్పటికీ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.


ఇక సినిమా విషయానికొస్తే దీన్ని డాక్యుమెంటరీగా కాకుండా.. సీరియస్ ఘటన కాకుండా ఒక కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. జెండే, ఆయన టీమ్.. చార్లెస్ ను పట్టుకోవడానికి ఎంత శ్రమించారు. అప్పటి రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేకున్నా ఎంత చాకచక్యంగా ఒక క్రిమినల్ పట్టుకున్నారు అనేది చూపించారు. అయితే సినిమా మొత్తం కామెడీగా సాగిపోయేసరికి అంత సీరియస్ నెస్ రాదు చార్లెస్ శోభరాజ్ లాంటి కరుడుగట్టిన నేరస్థుడు హత్య చేయడం, పారిపోవడం లాంటివి చాలా సిల్లీగా చూపించారు. దీనివలన సినిమాపై అంత ఉత్కంఠ రాదు.


జెండే పాత్రలో మనోజ్ భాజ్ పాయి అదరగొట్టేశాడు. చార్లెస్ శోభరాజ్ గా జిమ్ సర్ఫ్ ఓకే అని చెప్పొచ్చు. అయితే అసలు ఎందుకు శోభరాజ్.. బికినీ వేసుకున్న అమ్మాయిలను చంపుతున్నాడు.. ? దాని వెనుక ఉన్న కారణాన్ని ఎక్కువ వివరించలేదు. కేవలం గోవాలో చార్లెస్ ను పట్టుకోవడానికి జెండే టీమ్ కు దొరికిన క్లూస్ ఏంటి.. ? అతడిని ఎలా పట్టుకున్నారు అనేది మాత్రమే ఇందులో చూపించారు. ఇప్పటితరానికి తెలియని ఒక నేరస్థుడిని పట్టుకున్న పోలీస్ కథనే ఇన్స్పెక్టర్ జెండే.

Onam 2025 : ఓనమ్‌ అగోషం.. మలయాళ భామల అందాల విందు

Manchu Manoj: ఓ.. చెలియా’ నుంచి ‘నువ్వే చెప్పు చిరుగాలి’ సాంగ్ వచ్చేసింది 

Updated Date - Sep 06 , 2025 | 04:11 PM