Manchu Manoj: ఓ.. చెలియా’ నుంచి ‘నువ్వే చెప్పు చిరుగాలి’ సాంగ్ వచ్చేసింది 

ABN, Publish Date - Sep 06 , 2025 | 11:01 AM

నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్నారు. ‘నువ్వే చెప్పు చిరుగాలి’ అంటూ సాగే ఈ పాటను మంచు మనోజ్ విడుదల చేశారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ కి మంచు మనోజ్ అభినందనలు తెలియజేశారు. ఈ పాటను సాయి చరణ్ ఆలపించగా.. ఎంఎం కుమార్ బాణీని అందించారు.  సుధీర్ బగడి రాసిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. లిరికల్ వీడియోని చూస్తుంటే మంచి ప్రేమ కథా చిత్రాన్ని అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.   

Updated at - Sep 06 , 2025 | 11:28 AM