సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Agastya Nanda: యుద్ధ వీరుడి బయోపిక్‌తో బిగ్ బి మనవడి ఎంట్రీ

ABN, Publish Date - Dec 19 , 2025 | 06:14 PM

స్టార్ హీరో వారసుడి లాంచింగ్ అంటే ఓ లెవెల్ లో ఉంటుంది. పక్కా కమర్షియల్ వ్యాల్యూస్ తో కచ్చితంగా హిట్ కొట్టే సబ్జెక్టునే ఎంచుకుంటారు. కానీ అభిషేక్ బచ్చన్ వారసుడు మాత్రం ఎవరూ ఊహించని సబ్జెక్టుతో వస్తుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

బాలీవుడ్‌లో ఇండో - పాక్ యుద్ధాల నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. 'ఎల్‌ఓసీ కార్గిల్', 'ఉరి' వంటి సినిమాలు బాక్సాఫీస్‌లో ఘన విజయం సాధించాయి. ఇటీవల విడుదలైన 'దురంధర్' కూడా భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది. త్వరలో 'బార్డర్ 2' కూడా ఈ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ నేపథ్యంలో మరో మూవీ వస్తుండటం.. అందులో బిగ్ బి అమితాబ్ మనవడు నటిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బసంతర్ దగ్గర అసాధారణ వీరత్వం ప్రదర్శించిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ జీవిత కథ ఆధారంగా 'ఇక్కీస్' అనే మూవీ వస్తోంది. భారత సైన్య చరిత్రలో అతి చిన్న వయసులో పరమ్ వీర్ చక్ర అందుకున్న వీరుడిగా అరుణ్ ఖేత్రపాల్ నిలిచారు. కేవలం 21 ఏళ్ల వయసులో పది పాకిస్తాన్ ట్యాంకులను ధ్వంసం చేసి వీర మరణం పొందారు. అయితే ఈ చిత్రంతో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా గ్రాండ్ థియేట్రికల్ ఎంట్రీ ఇస్తుండటం అత్యంత ఆసక్తిరేపుతోంది.

వీర సైనికుడు అరుణ్ ఖేత్రపాల్ పాత్రలో అగస్త్య కనిపించబోతున్నాడు. వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర.. అరుణ్ తండ్రి పాత్రలో, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ధర్మేంద్ర చివరి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. నేషనల్ అవార్డు విజేత శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్‌లో మడ్డాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. యుద్ధ దృశ్యాలు, ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన ట్రైలర్, సినిమాపై అంచనాలను పెంచేసింది. డిసెంబర్ 25, 2025న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జనవరి 1, 2026న థియేటర్లలోకి రానుంది. నట వారసులు సాధారణంగా కమర్షియల్ మసాలా సినిమాలతో ఎంట్రీ ఇస్తున్న సమయంలో అగస్త్య మాత్రం గట్టి కంటెంట్ ఉన్న బయోపిక్‌తో అడుగు పెడుతున్నాడు. మరీ అగస్త్యకు ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందా అని అందరూ ఎగ్జయింటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

Read Also: Tollywood: సభ్యత్వాల రద్దును తప్పు పట్టిన కోర్టు

Read Also: Bandla Ganesh: ఆరిపోయే దీపం.. ఎంత మాట అన్నావ్ బండ్లన్న

Updated Date - Dec 19 , 2025 | 06:21 PM