సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Piyush Pandey: నటుడు, ఇలా అరుణ్ సోదరుడి కన్నుమూత

ABN, Publish Date - Oct 25 , 2025 | 01:41 PM

తన సోదరుడు, ఇండియన్ యాడ్ గురు పీయూష్ పాండే మృతి పట్ల ఇలా అరుణ్ ఆవేదన వ్యక్తం చేసింది. క్రికెట్ నుండి ప్రకటనల రంగానికి వెళ్ళిన ఆయన భారతీయ సంస్కృతికి ఎంతో ప్రాధాన్యమిచ్చారని తెలిపింది.

Piyush Pandey

యాడ్ గురు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీయూష్ పాండే (70) (Piyush Pandey) అనారోగ్యంతో కన్నుమూశారు. రాజస్థాన్ కు చెందిన పీయుష్ పాండే రాజకీయ ప్రచార వ్యూహకర్తగానే కాకుండా భారతీయ ప్రకటనల రంగంలో తనదైన ముద్రను వేశారు. 1982లో ఒగిల్వీ ఇండియా ప్రకటన సంస్థలో చేరిన ఆయన ఈ రంగంలో సమూల మార్పులు చేశారు. దేశీయతకు ప్రాధాన్యమిస్తూ, ప్రాశ్చత్య పోకడలకు దూరంగా వాణిజ్య ప్రకటనల రూపకల్పన చేశారు. అంతర్జాతీయ సంస్థలు సైతం ఆయన విధానానికి జేజేలు పలికాయి. ఆయన నేతృత్వంలో వచ్చిన పలు వాణిజ్య ప్రకటనలు కోట్లాది మందిని ఆకట్టుకున్నాయి.


విశేషం ఏమంటే... పీయుష్ పాండేలో చక్కని నటుడు కూడా ఉన్నాడు. 2013లో విడుదలైన హిందీ సినిమా 'మద్రాస్ కేఫ్‌' (Madras Cafe) లో పీయూష్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ సెక్రటరీగా నటించారు. అలానే దీనికి ముందు 1999లో వచ్చిన హిందీ సినిమా 'భోపాల్ ఎక్స్ ప్రెస్' (Bhopal Express) కు రచయితగా వ్యవహరించారు. ప్రముఖ గాయని, నటి ఇలా అరుణ్ (Ila Arun), పీయుష్ పాండే సోదరి. ఏడుగురు సోదరీమణులకు ఆయన ఒక్కడే సోదరుడని ఇలా అరుణ్ చెప్పారు. ఆయన మరణంతో తామంతా అనాధలమయ్యామని అన్నారు. క్రికెటర్ రంజీ ట్రోఫీలో రాణించిన పీయూష్ పాండే ఆ తర్వాత ప్రకటన రంగంలోకి అడుగుపెట్టి, భారతీయ యాడ్ గురు గా అవతరించారని అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఆయనకెంతో మక్కువ అని, తన రంగంలోనే వాటికి పెద్ద పీట వేశారని కొనియాడారు.

Also Read: Rana Daggubati: తండ్రి కాబోతున్న మరో యంగ్ హీరో...

Also Read: Rahul Ravindran: హాస్టల్‌లో జరిగిన చిన్న సంఘటన ఈ సినిమాకు పునాది

Updated Date - Oct 25 , 2025 | 03:44 PM