Rahul Ravindran: హాస్టల్‌లో జరిగిన చిన్న సంఘటన ఈ సినిమాకు పునాది

ABN , Publish Date - Oct 25 , 2025 | 02:57 PM

ఈ సినిమాకు లవర్‌తో వెళ్లే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి. క్లైమాక్స్ అయ్యాక ఆ అమ్మాయి మిమ్మల్ని హగ్‌ చేసుకుంటే మీరు మంచి బాయ్‌ఫ్రెండ్‌.. సైలెంట్‌గా వెళ్లిపోతే..


రష్మిక (Rashmika Mandanna), దీక్షిత్‌ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (the Girl Friend). రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికకు జోడీగా దీక్షిత్‌శెట్టి నటిస్తున్నారు. నవంబర్‌ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.


బన్నీ వాసు మాట్లాడుతూ
‘దీక్షిత్‌శెట్టి, రష్మిక చక్కగా నటించారు. కచ్చితంగా ఈ చిత్రానికి అవార్డు వస్తుంది. రష్మిక అనడం కంటే ఇండియన్‌ క్రష్మిక అంటే బావుంటుందేమో! ఈ సినిమాకు లవర్‌తో వెళ్లే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి. క్లైమాక్స్ అయ్యాక ఆ అమ్మాయి మిమ్మల్ని హగ్‌ చేసుకుంటే మీరు మంచి బాయ్‌ఫ్రెండ్‌.. సైలెంట్‌గా వెళ్లిపోతే మాత్రం కొట్టడం ఖాయం’ అని నవ్వుతూ అన్నారు.

దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ
‘రిలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు. నిజజీవితాలకు దగ్గరగా ఉండే సినిమా ఇది. ట్రెండ్‌లో ఉన్న అంశాలతోనే సినిమా  తెరకెక్కించాలి అనే ఆలోచనను పక్కనపెట్టి ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాం. ఏ దర్శకులకైనా రష్మిక, ధీక్షిత్‌లాంటి నటీనటులు దొరకడం అదృష్టం. రెండు పాత్రలకు ప్రాణం పోశారు. 13 ఏళ్ల నుంచి ఈ కథ గురించి ఆలోచిస్తున్నాను. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు జరిగిన ఓ చిన్న సంఘటన ఈ సినిమాకు పునాది. 5 ఏళ్ల క్రితం దాన్ని స్ర్కీన్‌ప్లేగా రాసుకున్నాను. ఇన్ని రోజులకు మీ ముందుకు వస్తుంది’ అని అన్నారు.

ధీరజ్‌ మాట్లాడుతూ
‘రష్మిక మందన్నా ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. విడుదలయ్యాక రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని కోరారు’ అని అన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 03:04 PM