Rana Daggubati: తండ్రి కాబోతున్న మరో యంగ్ హీరో..
ABN , Publish Date - Oct 25 , 2025 | 03:38 PM
మిగతా విషయాల్లో ఈ ఏడాది ఎలా ఉన్నా టాలీవుడ్ హీరోల ఇంట మాత్రం శుభకార్యాలు ఒకదాని తరువాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి.
Rana Daggubati: మిగతా విషయాల్లో ఈ ఏడాది ఎలా ఉన్నా టాలీవుడ్ హీరోల ఇంట మాత్రం శుభకార్యాలు ఒకదాని తరువాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొందరు హీరోలు పెళ్లి పీటలు ఎక్కి ఒక ఇంటి వారవ్వగా.. మరికొందరు హీరోలు తండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది వరుణ్ తేజ్ తండ్రిగా మారాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో బిడ్డకు తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు మన భల్లాదేవ.. రానా దగ్గుబాటి.
ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానా దగ్గుబాటి కరోనా సమయంలో అతికొద్దిమంది బంధుమిత్రుల మధ్య మిహికా బజాజ్ ను వివాహమాడాడు. వీరి వివాహం జరిగి ఐదేళ్లు అవుతుంది. మధ్యలో చాలామంది హీరోలు పెళ్లి చేసుకోవడం, తల్లిదండ్రులుగా మారడం కూడా జరిగింది. కానీ, రానా - మిహీక మాత్రం కొన్నేళ్లు పిల్లల కోసం వేచి ఉందామని అనుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం మిహీక ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. దీంతో దగ్గుబాటి ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. దగ్గుబాటి రామానాయుడు మరణించాకా.. ఆ ఇంట జరిగిన మొదటి శుభకార్యం రానా పెళ్లి అయ్యినప్పటికీ వారసుడు ఇంకా జన్మించలేదు. గతేడాది రానా తమ్ముడు అభిరామ్ కు ఆడపిల్ల జన్మించింది. దీంతో ఈసారి రానాకు కచ్చితంగా తన తాతనే జన్మిస్తాడు అని దగ్గుబాటి కుటుంబం ఆశపడుతుందని తెలుస్తోంది. ఇక రానా తండ్రి కాబోతున్నాడని తెలియడంతో అభిమానులు దగ్గుబాటి వారసుడి కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు.
Rahul Ravindran: హాస్టల్‌లో జరిగిన చిన్న సంఘటన ఈ సినిమాకు పునాది
Janhvi Kapoor: పుురుషాధిక్యత ప్రపంచంలో .. నేర్పుతో ఉండాలి..