Harshvardhan Rane: బాలీవుడ్‌లో.. తెలుగోడి హంగామా
ABN , Publish Date - May 27 , 2025 | 03:58 PM
హర్షవర్థన్ రాణే, సోనమ్ బజ్వా జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'ఏక్ దీవానే కీ దీవానియత్'. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.
మోడలింగ్ నుండి చిత్రసీమలోకి అడుగు పెట్టాడు తెలుగువాడైన హర్షవర్థన్ రాణే (Harshavardhan Rane). 'తకిట తధిమి'తో పాటు పలు తెలుగు చిత్రాలలో నటించి నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పైన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి అక్కడా రాణిస్తున్నాడు. పలు వైవిధ్య మైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అతను నటించిన తాజా చిత్రం 'ఏక్ దీవానే కీ దీవానియత్' (Ek Deewane ki Deewaniyat) సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ ప్రేమకథా చిత్రంలో సోనమ్ బజ్వా (Sonam Bajwa) నాయికగా నటించింది. సోనమ్ సైతం గతంలో 'ఆటాడుకుందాం రా' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అలానే 'బాబు బంగారం'లో ఓ పాటలో మెరిసింది. ఇప్పుడు హిందీలో ఆమె కూడా బిజీ ఉంది. 'హౌస్ ఫుల్ 5'తో పాటు 'బాఘీ 4' చిత్రాలలో నటిస్తోంది. గతంలో 'మర్జావాన్', 'సత్యమేవ జయతే' చిత్రాలను రూపొందించిన మిలాప్ జవేరీ 'ఏక్ దీవానే కి దీవానియత్' మూవీని తెరకెక్కించాడు.
ప్రస్తుతం హిందీలో హర్షవర్థన్ రాణే 'సన్ తేరి కసమ్' సీక్వెల్ లో నటిస్తున్నాడు. అలానే 'సరబ్ జీత్' ఫేమ్ ఓమాంగ్ కుమార్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకూ సైన్ చేశాడు. ఈ సినిమాలో సాదియా ఖతీబ్, కరన్ వీర్ మెహ్రా, ఇప్సితా ఇతర కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ ప్రెజెంట్ చేస్తోంది.
Also Read: Unni Mukundan: మేనేజర్ పై మార్కో హీరో దాడి
Also Read: Bhanumathi Ramakrishna: అరవై ఏళ్ళ అక్కినేని అంతస్తులు
Also Read: Sunny Leon: హాలీవుడ్ చిత్రంలో పోర్న్ స్టార్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి