Bhanumathi Ramakrishna: అరవై ఏళ్ళ అక్కినేని అంతస్తులు
ABN , Publish Date - May 27 , 2025 | 02:32 PM
అక్కినేని, కృష్ణకుమారి, భానుమతి రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన 'అంతస్తులు' చిత్రం అరవై యేళ్ళు పూర్తి చేసుకుంది. వి. మధుసూదనరావు దర్శకత్వంలో వీబీ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు.
జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'అంతస్తులు' మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది... మే 27తో 'అంతస్తులు' సినిమా అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది.
తెలుగు చిత్రసీమలో అంతకు ముందు జానపద కథల్లోనో, లేక పురాణగాథల్లోనో దెయ్యాల ప్రస్తావన కనిపించింది... అయితే 'అంతస్తులు' (Anthasthulu) సినిమాలోని దెయ్యం పాట మాత్రం జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.. తరువాతి రోజుల్లో ఎన్నో సినిమాల్లో అలా నేపథ్యంలో వినిపించే దెయ్యం పాటలు చోటు చేసుకోవడానికి 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' నిర్మించిన 'అంతస్తులు' చిత్రమే ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు... ఏయన్నార్ (Anr), భానుమతి (Bhanumathi), కృష్ణకుమారి (Krishna Kumari), జగ్గయ్య (Jagaiah) ప్రధాన పాత్రధారులుగా రూపొందిన 'అంతస్తులు' చిత్రం 1965 మే 27న విడుదలయింది... వి. మధుసూదనరావు (V Madhusudana Rao) దర్శకత్వంలో వి. బి. రాజేంద్రప్రసాద్ (V B Rajendra Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు... కేవీ మహదేవన్ (K V Mahadevan) బాణీల్లో రూపొందిన పాటలు విశేషాదరణ పొందాయి... ముఖ్యంగా దెయ్యం పాట మరపురానిదిగా నిలచిపోవడం విశేషం!
'అంతస్తులు' కథ విషయానికి వస్తే - క్రమశిక్షణ పేరుతో కన్నకొడుకులతోనూ అతికఠినంగా ప్రవర్తిస్తుంటాడు ఓ జమీందార్... అలాంటి అతనే తాను కూడా ఓ తప్పు చేశానని పెద్ద కొడుకుతో చెప్పి కన్నుమూస్తాడు... తరువాత తమ అంతస్తును కాపాడుకొనేందుకు హీరో ఎలా సతమతమయ్యాడన్నదే మిగిలిన కథ... ఈ కథను జవర్ సీతారామన్ రాయగా, ఆచార్య ఆత్రేయ సంభాషణలు పలికించారు... కొసరాజు, ఆరుద్ర, ఆత్రేయ గీత రచన చేశారు...
'అంతస్తులు' చిత్రంలో కథానుగుణంగా భానుమతి, ఏయన్నార్ అక్కాతమ్ముళ్ళవుతారు... ఇక హీరో తల్లిగా జి.వరలక్ష్మి నటించారు... భానుమతి డైలాగ్స్ ఇందులో జనాదరణ పొందాయి... ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమా, ఉత్తమ చిత్రంగా బంగారు నందినీ సొంతం చేసుకోవడం విశేషం!... ఈ చిత్రకథను పోలి తరువాతి రోజుల్లో మరెన్నో సినిమాలు తెరకెక్కాయి.
Also Read: Sunny Leon: హాలీవుడ్ చిత్రంలో పోర్న్ స్టార్...
Also Read: Bhairavam: మాస్ కమర్షియల్ హీరోగా బెల్లంకొండ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి