Kalam Biopic: ఓం రౌత్ సంచలనం.. ధనుష్ తో కలాం బయోపిక్
ABN, Publish Date - May 22 , 2025 | 09:55 AM
బాలీవుడ్‌లో మరో ఆసక్తికర చిత్రానికి తెర లేచింది. ఇందులో నటించనున్న వారు, టెక్నిషియన్లు కూడా అంతే అశ్చర్యం కలిగించక మానదు.
బాలీవుడ్‌లో మరో ఆసక్తికర చిత్రానికి తెర లేచింది. ఇందులో నటించనున్న వారు, టెక్నిషియన్లు కూడా అంతే అశ్చర్యం కలిగించక మానదు. ప్రస్తుతం మన దేశంలో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో బయోపిక్ తెరపైకి ఎక్కేందుకు సిద్దమవుతోంది. ఇండియన్ మిస్సైల్ మ్యాన్ (The Missile Man of India), మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (A.P.J. Abdul Kalam) జీవితకథను తెరమీదకు తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది.
రెండేండ్ల క్రితం ఆదిపురుష్, అంతకుముందు బాలీవుడ్‌లో తానాజీ చిత్రాలను తెరకెక్కించిన ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో సౌత్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా కలాం ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా రూపుదిద్దుకోబోతుంది. ఈ సినిమాను హిందీ బడా నిర్మాతలు టీ సిరీస్ భూషణ్ కుమార్, కృషణ్ కుమార్‌తో కలిసి తెలుగు నిర్మాతలు అనీల్ సుంకర, అభిషేక్ ఆగర్వాల్ తమ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments), అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal Arts) బ్యానర్లపై నిర్మించనుండడం విశేషం. ఇందుకు సంబంధించి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను కేన్స్ (Cannes Film Festival) వేదికగా బుధవారం రాత్రి రిలీజ్ చేశారు. అయితే ఓం రౌత్ డైరెక్టర్ అనే సరికి చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు.
ఇదిలాఉంటే ప్రస్తుతం మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్న ధనుష్ (Dhanush).. ఆవెంటనే ఇప్పుడు కలాం బయోపిక్‌లో నటిస్తుండడం, ఆ ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం. ఇక ఇవే కాకుండా బాలీవుడ్‌లో మరి కొన్ని జీవిత చరిత్రలు తెరకెక్కించేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ సైతం తెలుగు జవాన్ సంతోష్ బాబు బయోపిక్‌కు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే తెలుగులో మల్లయోదుడు కోడి రామ్మూర్తి (Kodi Rammurthy naidu), బ్యాట్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) బయోపిక్‌లు కూడా తెరకెక్కించేందుకు మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారు.
Also Read: Seetharama Sastry: రామజోగయ్య శాస్త్రికి సిరివెన్నెల పురస్కారం
Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్
Also Read: Mohanlal: కన్నప్ప నుంచి.. కిరాత వచ్చేశాడు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి