సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

UP CM: యోగి బయోపిక్ టీజర్ వచ్చేసింది...

ABN, Publish Date - Jul 03 , 2025 | 10:10 AM

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ బయోపిక్ విడుదలకు సిద్థమైంది. ఆగస్ట్ 1న జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

కాదేదీ కవితకనర్హం అని మహాకవి శ్రీశ్రీ (Sri Sri) అన్నట్టుగా... కాదేదీ బయోపిక్ కు అనర్హం అని కూడా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజంలో మంచిగానో, చెడుగానో ఏదో రకంగా పాపులారిటీ తెచ్చుకున్న వ్యక్తుల బయోపిక్స్ సినీ జనం ముందుకు వస్తున్నాయి. అప్పట్లో దేశనాయకులైన గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్‌ చంద్రబోస్ వంటి వారివి వచ్చేవి. ఆ తర్వాత స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్స్ నూ మనవాళ్ళు తీశారు. చిత్రం ఏమంటే... స్మగ్లర్ వీరప్పన్ లాంటి వారి బయోపిక్స్ సైతం వచ్చేశాయి.


ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్య నాథ్ (Yogi Adityanath) బయోపిక్ ను హిందీలో నిర్మిస్తున్నారు. 'అజయ్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి' (Ajey: The Untold Story of a Yogi) పేరుతో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో యోగి ఆదిత్యనాథ్ పాత్రను బాలీవుడ్ నటుడు అనంత్ జోషి పోషిస్తున్నాడు. రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పరేశ్‌ రావెల్, పవన్ మల్హోత్రా, గరిమా విక్రాంత్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 1న మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Also Read: Aankhon Ki Gustaakhiyan: మరో అంధ సంగీత కళాకారుడి సినిమా

Also Read: Thug life OTT: షాకింగ్‌.. స‌డ‌న్‌గా ఓటీటీకి క‌మ‌ల్‌ థ‌గ్‌లైఫ్‌! ఇక్క‌డైనా చూస్తారా

Updated Date - Jul 03 , 2025 | 10:24 AM