Aankhon Ki Gustaakhiyan: మరో అంధ సంగీత కళాకారుడి సినిమా
ABN , Publish Date - Jul 03 , 2025 | 09:51 AM
ప్రముఖ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె శనయా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె నటిస్తున్న తొలి చిత్రం 'ఆంఖో కి గుస్తాఖియాన్' ఈ నెల 11న జనం ముందుకు రాబోతోంది.
బాలీవుడ్ లో ఒకప్పటి హీరోల కుమార్తెలు ఇప్పుడు హీరోయిన్లుగా వెండితెరపై రాణిస్తున్నారు. ఆ జాబితా చాలా పెద్దగానే ఉంది. అయితే తాజాగా ఆ లిస్ట్ లోకి సంజయ్ కపూర్ (Sanjay Kapoor) కుమార్తె శనయా కపూర్ (Shanaya Kapoor) కూడా చేరింది. ఆమె నటిస్తున్న తొలి చిత్రం 'ఆంఖో కి గుస్తాఖియాన్' (Aankhon Ki Gustaakhiyan). ఇందులో శనయా రంగస్థల కళాకారిణిగా నటిస్తోంది. 'ట్వెల్త్ ఫెయిల్' మూవీతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే ఇందులో హీరో. అతను అంధ సంగీత కళాకారుడి పాత్రను పోషిస్తున్నాడు.
బ్లైండ్ మ్యూజిక్ పర్సన్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా 'అంధాధున్' (Andhadhun). ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ ప్లేయర్ గా నటించిన ఈ సినిమాను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోరు. ఈ మూవీ పలు భారతీయ భాషల్లోనూ రీమేక్ అయ్యింది. ఇప్పుడు అలాంటి పాత్రనే 'ఆంఖో కి గుస్తాఖియాన్'లో విక్రమ్ పోషిస్తున్నాడు. రస్కిన్ బాండ్ రాసిన 'ది ఐస్ హావ్ ఇట్' అనే కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సంతోష్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విశాల్ మిశ్రా స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ నెల 11న మూవీ థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రేమలోని సంతోషం, బాధల సమ్మిళితంగా ఈ ట్రైలర్ సాగింది. ఈ సినిమాతో పాటు శనయా 'తూ యా మై' అనే సినిమాలోనూ నటిస్తోంది. అది వచ్చే యేడాది వాలెంటైన్స్ డే కానుకగా రానుంది.
Also Read: Thug life OTT: షాకింగ్.. సడన్‌గా ఓటీటీకి కమల్ థగ్‌లైఫ్! ఇక్కడైనా చూస్తారా