Tanushree Dutta: మరోసారి వార్తల్లోకి

ABN , Publish Date - Jul 23 , 2025 | 09:35 AM

నందమూరి బాలకృష్ణ సరసన 'వీరభద్ర' సినిమాలో నాయికగా నటించిన తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లోకి వచ్చింది. తన ఇంట్లోనే తాను హెరాస్ మెంట్ కు గురి అవుతున్నానంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో కన్నీళ్ళు పెట్టుకుంటూ పోస్ట్ చేసింది.

Tanushree Dutta

ఇరవై సంవత్సరాల క్రితం ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ గా ఎంపికైన తనుశ్రీ దత్తా (Tanushree Dutta) ఆ తర్వాత చిత్రసీమలోకి అడుగు పెట్టింది. విశేషం ఏమంటే... 2005లో 'ఆషిక్ బనాయా ఆప్నే' (Aashiq Banaya Aapne) సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తనుశ్రీ అదే సంవత్సరం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సరసన 'వీరభద్ర' (Veerabhadra) మూవీలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కే ప్రాధాన్యమిస్తూ పదేళ్ళ పాటు పలు చిత్రాలలో నటించింది.

రకరకాల వివాదాల కారణంగా నటనకు దూరమైన తనుశ్రీ దత్తా తాజాగా విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంట్లోనే తాను హరాస్ మెంట్ కు గురవుతున్నానని, పనివాళ్ళతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే స్టేషన్ కు వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయమని చెప్పారని తెలిపింది.


నిజానికి ఏదో కారణంగా తనుశ్రీ దత్తా మీడియాలో నానడం ఇది మొదటిసారి కాదు. గతంలోనే ఆమె తన సహనటుడు నానా పటేకర్ (Nana Patekar), వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తనను శారీరకంగా హింసించారంటూ సినీ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు కంప్లయిట్ ఇచ్చింది. అయితే దానిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఆ తర్వాత కొంతకాలానికి మీడియాలో వీరిపై ఆరోపణలు చేసింది. ఆమె చేసిన కంప్లైంట్స్ కారణంగానే 'మీ టూ' ఉద్యమం పాపులర్ అయ్యింది. కానీ ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవాలంటూ కొట్టిపడేశారు. మీడియా అటెన్షన్స్ ను పొందడానికే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కొందరు విమర్శించారు. ఆ తర్వాత సినిమా రంగానికి తనుశ్రీ దత్తా నిదానంగా దూరమై పోయింది. అయితే అడపా దడపా సోషల్ మీడియాలో వివాదాస్పదం అంశాలను లేవనెత్తుతూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఆమె విడుదల చేసిన వీడియో చూస్తే గుండెల్ని పిండేసేలా ఉంది. తన ఇంట్లోనే తాను హెరాస్ మెంట్ కు గురి అవుతున్నానని చెబుతూ, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని ఆమె ఆరోపిస్తోంది. కొంతకాలంగా రాత్రి సమయాల్లో భయంకరమైన శబ్దాలు వస్తున్నాయని, బిల్డింగ్ మేనేజ్ మెంట్ కు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆ శబ్దాలకు సంబంధించిన ఆడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకప్పుడు బాలీవుడ్ లో నటిగా ఓ వెలుగు వెలిగిన తనుశ్రీ దత్తా చేస్తున్న ఈ ఆరోపణలను ఎవరు, ఎంత వరకూ సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.

Also Read: Karuppu: బ‌ర్త్ డే స్పెష‌ల్.. సూర్య కరుప్పు లుక్ వ‌చ్చేసింది

Also Read: Wednesday Tv Movies: బుధ‌వారం, జూలై 23.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

Also Read: Hansika: ఫ్రెండ్ భర్తతో ప్రేమ పెళ్లి.. మూడేళ్లకే విడాకులు

Updated Date - Jul 23 , 2025 | 09:47 AM