Hansika: ఫ్రెండ్ భర్తతో ప్రేమ పెళ్లి.. మూడేళ్లకే విడాకులు

ABN , Publish Date - Jul 22 , 2025 | 07:54 PM

అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Hansika

Hansika: అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ భామ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసనా నటించి మెప్పించింది. దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో బబ్లీ బ్యూటీగా ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత కుర్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా మారాలనుకుంది. కానీ, అది జరగలేదు.


ఇక తెలుగును వదిలి తమిళ్ కు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ సినిమాలతో పాటు.. శింబు ప్రేమలో కూడా పడింది. సరే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనుకుంటే.. కొన్నేళ్ళకే బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇక అయినా కూడా హన్సిక దైర్యంగా నిలబడి.. సినిమాలుచేస్తూనే వచ్చింది. బొద్దుగా ఉన్న భామ బక్కచిక్కి మారినంత అందంగా తయారయ్యింది. ఇక కెరీర్ లో కొద్దిగా వెనకబడగానే హన్సిక పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి కూడా పెద్ద చర్చకు దారితీసింది. దానికి కారణం ఈ చిన్నది పెళ్లి చేసుకున్నది తన బెస్ట్ ఫ్రెండ్ భర్తను కాబట్టి.


హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ భర్త సోహైల్ కతూరియాతో ప్రేమాయణం నడిపి.. చివరకు ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అది కూడా మాములు పెళ్లి కాదు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. అంతేనా వారి ప్రేమ, పెళ్లి అన్ని కలిసి ఒక డాక్యుమెంటరీ కూడా తీసింది. ఇక పెళ్లి తరువాత కూడా హన్సిక సినిమాలు చేస్తూ వస్తుంది. పెళ్ళికి ముందు ఎలా అయితే విజయాలను అందుకోలేదో.. పెళ్లి తరువాత కూడా అమ్మడి కెరీర్ అలానే కొనసాగుతుంది.


ఇక సినిమాలు వదిలేసి ఈ చిన్నది డ్యాన్స్ షోకు జడ్జిగా కూడా మారింది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్న హన్సిక .. భర్తకుదూరంగా ఉంటుంది అన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు నడుస్తున్నాయని, భర్తపై కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన హన్సిక.. తల్లి దగ్గరే ఉంటుందని, త్వరలోనే విడాకులు తీసుకొనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ విడాకుల వార్తలను సోహైల్ ఖండించాడు. ఈ వార్ల్లో నిజం లేదని, ఇవన్నీ అబద్దాలు అని చెప్పుకొచ్చాడు. కానీ, ఇప్పటివరకు హన్సిక మాత్రం నోరు మెదపలేదు. కనీసం ఎవరైనా అడగడానికి ప్రయత్నించినా కూడా కనీసం సమాధానం ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదని టాక్. అంత గాఢంగా ప్రేమించి, అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని.. ముచ్చటగా మూడేళ్లు కూడా కలిసి ఉండలేక విడిపోతుండడం దారుణమని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే హన్సిక మౌనం వీడాల్సిందే.

Anasuya: పెద్ది డైరెక్టర్ బుచ్చి.. నన్ను అలా పిలవమనేవాడు

Harihara Veeramallu: హరిహర వీరమల్లు.. యుఎస్ షోస్ క్యాన్సిల్?

Updated Date - Jul 22 , 2025 | 07:54 PM