సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Directed By Aditya Om: సుబోధ్ భావే హీరోగా ‘సంత్ తుకారాం’

ABN, Publish Date - Jul 15 , 2025 | 05:36 PM

నటుడు ఆదిత్య ఓం దర్శకత్వంపై దృష్టి పెట్టాడు. తాజాగా 17వ శతాబ్దానికి చెందిన సంత్ తుకారం జీవితాన్ని మరాఠీ, హిందీ భాషల్లో రూపొందించాడు.

నటుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన ఆదిత్య ఓం మరో పక్క ఎన్నో సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన దర్శకత్వం వైపుకూ మళ్ళారు. అందులో భాగంగానే ఆదిత్య ఓం 17వ శతాబ్దపు మరాఠీ సాధువు, కవి, భక్తిని ప్రతిఘటనగా మార్చిన సంత్ తుకారం (Sant Tukaram) జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. సంత్ తుకారం జీవితం, వారసత్వం, సాహిత్య విప్లవం ఆధారంగా ఆదిత్య ఓం (Aditya Om) 'సంత్ తుకారం' పేరుతో సినిమా తీశారు. ఇందులో టైటిల్ రోల్ ను ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే (Subodh Bhave) పోషించారు. ఈ సినిమా మరాఠీ, హిందీ భాషల్లో జూలై 18న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.


ఈ చిత్రంలో శివ సూర్యవంశీ, షీనా చోహన్, సంజయ్ మిశ్రా, అరుణ్ గోవిల్, శిశిర్ శర్మ, హేమంత్ పాండే, గణేష్ యాదవ్, లలిత్ తివారీ, ముఖేష్ భట్, గౌరీ శంకర్, ట్వింకిల్ కపూర్, రూపాలి జాదవ్, డిజే అక్బర్ సామి వంటి ప్రఖ్యాత నటులు కీలక పాత్రలకు జీవం పోశారు. ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకి హైలెట్ కానున్నదని ఆదిత్య ఓం తెలిపారు.

నిఖిల్ కామత్, రవి త్రిపాఠి, వీరల్, లావన్ స్వరపరిచిన పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని, శాస్త్రీయ, జానపద, భక్తి భావాల్ని కలిగించేలా పాటలు ఉండబోతున్నాయని ఆదిత్య ఓం చెప్పారు. ప్రతి పాట తుకారాం పాత్ర భావోద్వేగ, తాత్విక పరిణామాన్ని ప్రతిధ్వనిస్తుందని ఆయన అన్నారు. పురుషోత్తం స్టూడియోస్‌తో కలిసి బి. గౌతమ్‌కు చెందిన కర్జన్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది.

Also Read: Jani Master Reentry: మళ్లీ ఫామ్ లోకి జానీ మాస్టర్.. ఆ సినిమాతో తెలుగులో రీ-ఎంట్రీ

Also Read: Mahesh Bhatt about Mohit suri Saiyaara : ‘ఆషికి’ రోజుల్ని తలుచుకోవడం ఆనందం

Updated Date - Jul 15 , 2025 | 05:43 PM