Young Tiger NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫర్ ఏ రీజన్!

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:54 PM

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారింది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్‌గా మారిన తారక్.. ప్రస్తుతం చేసే ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయికి చేరింది. అయితే తారక్ చేసే సినిమాల రేంజ్‌ ఎలా అయితే మారుతుందో.. ఆయనలోని మానవత్వం, పెద్దరికం కూడా అదే స్థాయికి చేరుతుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. తన స్టాఫ్ బర్త్‌డేని కూడా దగ్గరుండి మరీ సెలబ్రేట్ చేసేంత ఉన్నత వ్యక్తిత్వానికి తారక్ చేరుకున్నారు.

Young Tiger NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫర్ ఏ రీజన్!
Jr NTR Celebrates His Fitness Couch Birthday

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది పెద్దలు చెప్పే మాట. అది అక్షరాలా చేసి చూపిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR). ప్రస్తుతం తారక్ (Tarak) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారింది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్‌గా మారిన తారక్.. ప్రస్తుతం చేసే ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయికి చేరింది. అయితే తారక్ చేసే సినిమాల రేంజ్‌ ఎలా అయితే మారుతుందో.. ఆయనలోని మానవత్వం, పెద్దరికం కూడా అదే స్థాయికి చేరుతుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. తన స్టాఫ్ బర్త్‌డేని కూడా దగ్గరుండి మరీ సెలబ్రేట్ చేసేంత ఉన్నత వ్యక్తిత్వానికి తారక్ చేరుకున్నారు.

*Mahesh Babu: పొడవాటి జుట్టు, గడ్డం.. సూపర్ స్టార్ లుక్ అదిరిపోలా..


ఎన్టీఆర్‌ని చిన్నప్పటి నుండి చూసే వారు చెప్పే మాట ఏమిటంటే.. ఆయనలో చాలా మార్పు వచ్చిందని, చాలా పెద్దరికంగా వ్యవహరిస్తున్నారని. మరీ ముఖ్యంగా తండ్రి మరణానంతరం ఎన్టీఆర్‌లో చాలా ఛేంజ్ వచ్చిందని చెబుతుంటారు. ప్రతి ఒక్కరినీ ఆయన గౌరవించే తీరు, యోగక్షేమాలు అడిగే విధానం.. అలాగే చెప్పే పద్ధతి.. ఇలా అన్నీ ఎన్టీఆర్‌ (NTR)ని ఎక్కడో నిలబెడుతున్నాయి. ఇప్పుడు కూడా తన ఫిట్నెస్ కోచ్ బర్త్‌డే గుర్తు పెట్టుకుని మరీ కాస్ట్‌లీ కేక్ తెప్పించి మరీ సెలబ్రేట్ చేశారు. ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమకు, మానవత్వానికి ఆ ఫిట్నెస్ కోచ్ కుమార్ మన్నవ (Kumar Mannava Birthday) ఎంతగా పొంగిపోయారంటే.. ఎన్టీఆర్‌ను ప్రేమ, మానవత్వం చూపించడంలో ఓ బుక్‌గా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం కుమార్ మన్నవ బర్త్‌డే‌ని ఎన్టీఆర్ సెలబ్రేట్ చేస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Jr-NTR.jpg

ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ (Devara) అనే చిత్రంలో యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ (War2)లోనే ఆయన చేస్తున్నారు. ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా సెట్స్‌పై ఉండగా.. ‘దేవర’ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు కాకుండా.. ‘కెజియఫ్, సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమాకు టైగర్ ఓకే చెప్పి ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ కూడా రానుంది.

Updated Date - Apr 19 , 2024 | 02:54 PM