Mahesh Babu: పొడవాటి జుట్టు, గడ్డం.. సూపర్ స్టార్ లుక్ అదిరిపోలా..

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:51 AM

పొడవాటి జుట్టు, గడ్డంతో.. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్‌ చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో ఉండబోతోన్న విషయం తెలిసిందే. SSMB29గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల నిమిత్తం దుబాయ్ వెళ్లిన టీమ్.. తిరిగి హైదరాబాద్ చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోలో మహేష్ బాబు లుక్ వైరలవుతోంది.

Mahesh Babu: పొడవాటి జుట్టు, గడ్డం.. సూపర్ స్టార్ లుక్ అదిరిపోలా..
Mahesh babu and Rajamouli with SSMB29 Team

పొడవాటి జుట్టు, గడ్డంతో.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) లేటెస్ట్ లుక్‌ చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) చేస్తున్న సినిమా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)తో ఉండబోతోన్న విషయం తెలిసిందే. SSMB29గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి టీమ్ కసరత్తులు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను టీమ్ వేగవంతం చేసింది. ఈ ప్రీ ప్రొడక్షన్ (SSMB29 Pre Production Work) పనుల నిమిత్తం రీసెంట్‌గా టీమ్ దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పనులను ముగించుకుని ప్రస్తుతం టీమ్ అంతా హైదరాబాద్ వచ్చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ బాబుని చూసిన వారంతా.. ‘ఏమున్నాడ్రా బాబు’ అని, మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.

*Sekhar Kammula: హ్యాపీడేస్, లీడ‌ర్ సినిమాల‌కు సీక్వెల్ తీయాల‌ని ఉంది


అంతేకాదు.. మహేష్ బాబు, రాజమౌళి ఈ వీడియోలో పక్కపక్కనే కనిపించడంతో.. త్వరలోనే సినిమాకు సంబంధించిన గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ వీడియోలో మహేష్ బాబు లుక్ చూస్తుంటే.. ఇంతకు ముందెన్నడూ మహేష్ కనిపించిన అవతార్‌లో ఈ సినిమాలో కనిపిస్తాడనేది సుస్పష్టమవుతోంది. మహేష్ బాబు లుక్‌ (Mahesh Babu Look Test) టెస్ట్ నిమిత్తమే.. టీమ్ దుబాయ్ వెళ్లినట్లుగా ఈ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. దుబాయ్‌లో టీమ్ అంతా డిస్కస్ చేస్తున్నట్లుగా ఓ పిక్ ఆల్రెడీ వైరల్ అవుతుండగా.. ఇప్పుడు మహేష్-రాజమౌళిని ఇలా చూసిన వారంతా లుక్ ఫైనలై ఉంటుందనేలా కామెంట్స్ చేస్తుండటం విశేషం.


rajamouli.jpg

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై ఇంకా సరైన ప్రకటన రాకుండానే.. ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగాయి. అందులోనూ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి చెబుతున్న ప్రతి విషయం.. బీభత్సమైన క్రేజ్‌కి కారణమవుతున్నాయి. దుర్గా ఆర్ట్స్‌ (Durga Arts)పై కె.ఎల్‌.నారాయణ (KL Narayana) నిర్మించనున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు.. విదేశీ భాషలలోనూ అనువదించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఓపెనింగ్ ఎప్పుడవుతుందా? అని అంతా వేచి చూస్తున్నారు. అతిత్వరలోనే.. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Apr 19 , 2024 | 11:51 AM