Angry Rantman: ప్ర‌ముఖ యూ ట్యూబర్ కన్నుమూత.. దేశవ్యాప్తంగా విషాదంలో సోషల్ మీడియా

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:06 PM

ప్ర‌ముఖ‌ సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్‌ , యూట్యూబ‌ర్ అబ్రదీప్ సాహా అలియాస్ యాంగ్రీ రాంట్‌మెన్ క‌న్నుముశారు.

Angry Rantman: ప్ర‌ముఖ యూ ట్యూబర్ కన్నుమూత.. దేశవ్యాప్తంగా విషాదంలో సోషల్ మీడియా
angry rant man

ప్ర‌ముఖ‌ సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్‌ , యూట్యూబ‌ర్ అబ్రదీప్ సాహా (Abhradeep Saha) అలియాస్ యాంగ్రీ రాంట్‌మెన్ (Angry Rantman) క‌న్నుముశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న ఆయన మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. సోష‌ల్ మీడియాలో చాలా పాపుల‌ర్ అయిన నిత్యం స‌మాజంలో ప్ర‌తి రోజూ జ‌రిగే అంశాల‌పై త‌న‌దైన‌ శైలిలో వీడియోలు చేసేవాడు. వాటిని సామాజిక మాధ్య‌మాల్లో, యూట్యూబుల్లో పోస్టు చేయ‌డంతో అతికొద్ది స‌మ‌యంలోనే దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన క్రేజును తెచ్చుకున్నాడు.

Angry Rantman.jpg

క‌ర్ణాట‌కు చెందిన అబ్రదీప్ సాహా (Abhradeep Saha) రాంట్ మ్యాన్ (Angry Rantman) అనే సోషల్‌ డియా పేరుతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. మొద‌ట కేజీఎఫ్ సినిమా రివ్యూతో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చిన ఇత‌ను అంద‌రిలా కాకుండా చాలా అవేశంతో, కోపంగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఫన్నీగా రివ్యూలు ఇచ్చేవాడు. ఒక్క సినిమా అనే కాకుండా క్రికెట్‌, ఫుట్‌బాల్‌, పాలిటిక్స్ ఇలా త‌న‌కు ప‌ట్టున్న ప్ర‌తి అంశంపై మొఖం మీద కొట్టిన‌ట్లు త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటూ నెట్టింట మంచి ప్రాచూర్యం పొందాడు. ఇప్పుడు ఇత‌ని మ‌ర‌ణంతో సోష‌ల్‌మీడియాలో అత‌ని గురించి చ‌ర్చ బాగా న‌డుస్తోంది. సెల‌బ్రిటీలు సైతం రిప్ అని పెడుతూ త‌మ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు. ట్వీట్లు, కామెంట్ల‌తో నేష‌న్ వైడ్‌గా నెంబ‌ర్‌1 స్థానంలో యాంగ్రీ రాంట్ మ్యాన్ పేరు ట్రెండింగ్ అవుతోంది.


images.jpeg

ఇదిలాఉండ‌గా.. ఓపెన్ హ‌ర్ట్ స‌ర్జ‌రీ కోసం బెంగ‌ళూరులోని ఓ ఆస్ప‌త్రిలో చేరిన అబ్రదీప్ సాహా (Abhradeep Saha) నెల రోజులకు పైగా చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ట్రీట్మెంట్‌కు స్పందిస్తున్నాడ‌ని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తాడంటూ వార్త‌లు వ‌చ్చాయి కానీ ఆయ‌న‌కు కిడ్నీలు ఫెయిల‌వ‌డంతో మ‌ల్టీ ఆర్గాన్స్ చెడిపోయి చాలా రోజులుగా ఐసీయూలోనే మృత్యువుతో పోరాడిన‌ట్లు అక్క‌డి వార్తా ప‌త్రిక‌లు తెలిపాయి, అయితే ఆయ‌న ఆస్ప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో అత‌నికి చేదోడు వాదోడు లేక చివ‌ర‌లో కొద్దిగా ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా వెంటాడిన‌ట్లు స‌మాచారం.

Updated Date - Apr 17 , 2024 | 03:21 PM