Harom Hara Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు వదిలిన ‘హరోం హర’ ట్రైలర్ ఎలా ఉందంటే?

ABN , Publish Date - May 30 , 2024 | 08:11 PM

హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘హరోం హర’. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసిన మేకర్స్, సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31)ని పురస్కరించుకుని గురువారం చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మహేష్ బాబు ఈ ట్రైలర్ వదిలారు.

Harom Hara Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు వదిలిన ‘హరోం హర’ ట్రైలర్ ఎలా ఉందంటే?
Sudheer Babu in Harom Hara Movie

విభిన్న కథలని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటున్న హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటించిన తాజా చిత్రం ‘హరోం హర’ (Harom Hara). ఈ సినిమాతో ఆయన మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసిన మేకర్స్, సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) జయంతి (మే 31)ని పురస్కరించుకుని గురువారం చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘హరోం హర స్క్రీన్‌పైకి ఏం తీసుకువస్తుందో చూడాలని ఎదురు చూస్తున్నాను. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సుధీర్‌బాబు అండ్ టీమ్‌కు శుభాకాంక్షలు’’ అని మహేష్ బాబు (Super Star Mahesh Babu) పోస్ట్ చేశారు.

*Sri Ranga Neethulu OTT: రెండు ఓటీటీలలో ‘శ్రీరంగనీతులు’.. బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్

ట్రైలర్ విషయానికి వస్తే.. ఆయుధాల ప్రాముఖ్యత గురించి సునీల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) నేపథ్యంలో 1989 నాటి కథ ఇది. జీవితంలో ఎలాంటి పురోగతి లేని, సంతృప్తి చెందని సుబ్రహ్మణ్యంకు ఒక సువర్ణావకాశం లభిస్తుంది. గన్స్ దొరకనప్పుడు అతను గన్ స్మిత్ అవుతాడు. సిటీలో హింసాత్మక ఘటనలు పెరగడంతో పోలీసులు గన్ స్మిత్ వెంట పడతారు. ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు ఎంగేజింగ్‌గా ఉంది. జ్ఞానసాగర్ ద్వారక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. గన్ మేకింగ్ కాన్సెప్ట్ టాలీవుడ్‌కి కొత్త. ఆయన రైటింగ్‌లో కొత్తదనం కనిపిస్తోంది. డైలాగ్స్ కూడా పవర్ ఫుల్‌గా ఉన్నాయి. సుధీర్ బాబు తన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. కుప్పం యాసలో, డైలాగ్ డెలివరీ, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ట్రైలర్‌కు బిగ్గెస్ట్ అసెట్స్. సునీల్‌ పాత్ర కూడా హైలెట్ అనేలా ఉంది. సుధీర్ బాబుకు జోడీగా మాళవిక శర్మ తన పాత్రను చక్కగా పోషించింది. ఓవరాల్‌గా చూస్తే.. మరో ‘పుష్ప’ని తలపిస్తోంది. (Harom Hara Trailer Talk)


Harom-Hara-pic.jpg

టెక్నికల్‌గా సినిమా చాలా బ్రిలియంట్‌గా వుంది. అరవింద్ విశ్వనాథన్ క్యాప్చర్ చేసిన విజువల్స్, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఇచ్చిన ఎలివేషన్స్ సినిమాపై క్రేజ్‌కి కారణమవుతున్నాయి. SSC బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్-క్లాస్‌లో వున్నాయి. టీజర్, పాటలు, ఇతర ప్రమోషన్‌లు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పగా, ట్రైలర్ అంచనాలని రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్. భారీ అంచనాలతో జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Latest Cinema News

Updated Date - May 30 , 2024 | 08:11 PM