Sri Ranga Neethulu OTT: రెండు ఓటీటీలలో ‘శ్రీరంగనీతులు’.. బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్

ABN , Publish Date - May 30 , 2024 | 04:10 PM

సక్సెస్‌ఫుల్‌ హీరోగా దూసుకుపోతోన్న సుహాస్‌తో పాటు.. ‘బేబి’ ఫేమ్ విరాజ్ అశ్విన్, ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్‌ర‌త్నం నటించిన ‘శ్రీరంగనీతులు’ మూవీ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతూ.. బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. రుహానీ శర్మ ఇందులో హీరోయిన్‌గా నటించింది.

Sri Ranga Neethulu OTT: రెండు ఓటీటీలలో ‘శ్రీరంగనీతులు’.. బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్
Sriranga Neethulu Movie Still

టాలీవుడ్‌లోని చిన్న హీరోలలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోన్న హీరో సుహాస్ (Suhas). ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ మినిమమ్ సక్సెస్ రేట్‌ని అందుకుంటున్నాయి. ఇటీవలే ఆయన నుంచి వచ్చిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్నవదనం’ సినిమాలు మంచి ఆదరణను పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన‌తో పాటు ‘బేబి’ ఫేమ్ విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్‌ర‌త్నం (Karthik Ratnam) నటించిన ‘శ్రీరంగనీతులు’ (Sri Ranga Neethulu) మూవీ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతూ.. బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా (Aha) ఓటీటీలో సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. రుహానీ శర్మ (Ruhani Sharma) ఇందులో హీరోయిన్‌గా నటించింది.

‘శ్రీరంగనీతులు’ కథ విషయానికి వస్తే (Sri Ranga Neethulu Movie Story).. ‘శ్రీరంగనీతులు’ సినిమాలో చాలామంది కథలున్నాయి, కానీ ప్రధానంగా సాగేవి ముగ్గురివే. శివ (సుహాస్) టీవీ రిపేర్ చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఆ నియోజకవర్గ ఎంఎల్ఏతో ఫ్లెక్సీ తన ఏరియాలో పెట్టించి అందరి కళ్ళల్లో పడాలని కోరిక. దానికి డబ్బులు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫ్లెక్సీ పెడతాడు, కానీ అది ఎవరో తీసేస్తారు. ఎవరు తీసేశారని వెతుకుతూ, స్నేహితులతో గొడవలు పడుతూ ఉంటాడు. తన తాహతుకు లేకపోయినా పరువుకోసం అప్పు చేసైనా ఇంకో ఫ్లెక్సీ పెట్టాలని అనుకుంటాడు, ఆ ప్రయత్నంలో అతను ఎటువంటి సంఘటనలను ఎదుర్కొన్నాడు, అతని కథ ఎలా మలుపు తిరిగింది. ఇక రెండోది వరుణ్ (విరాజ్ అశ్విన్), ఇందు (రుహాణి శర్మ)ల కథ. ఇద్దరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ కులం, ధనం అడ్డు వస్తుంది. ఇందు ధనవంతుల అమ్మాయి, ఆమెకి ఇంట్లో వేరే సంబంధం చూస్తారు. ఈలోగా ఆమె ప్రెగ్నెంట్ అని అనుమానం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళుతుంది. నాన్న అంటే ఇష్టం, అందుకని ఇంట్లో తన పెళ్లి గురించి చెప్పలేక భయపడుతూ ఉంటుంది. ఇటు ప్రియుడిని వదులుకోలేక, అటు ఇంట్లో చెప్పలేక ఆ ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ చివరికి ఎటు దారితీసింది?.

Sriranga-Neethulu-1.jpg

ఇక మూడో వ్యక్తి కార్తీక్ (కార్తిక్ రత్నం) కథ. చదువుకుంటాడు కానీ మత్తు పదార్ధాలకు బానిస అవుతాడు. నిరంతరం గంజాయి, సిగరెట్లు కాలుస్తూ తన గమ్యం ఏంటో తనకే తెలియని స్థితిలో అందరి దగ్గర అప్పులు చేస్తూ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు చిక్కుతాడు. అతని తండ్రి (దేవి ప్రసాద్) కొడుకు పరిస్థితిని చూసి అతన్ని ఎలాగైనా మార్చాలని ప్రయత్నాలు చేస్తాడు. కార్తిక్‌ని తీసుకొని వేరే ఊరుకు వెళుతున్నప్పుడు అనుకోని చిక్కుల్లో పడతాడు. కొడుకు చేసే పని కారణంగా.. అతను పోలీసు స్టేషన్‌లో ఇరుక్కుంటాడు. చివరికి వీరి పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం ఏమవుతుంది? ఇలా మూడు రకాలైన భిన్న కథలతో ఆసక్తిగా వుండే ఈ కథల ముగింపు ఏమైందో తెలుసుకోవాలంటే ‘శ్రీరంగనీతులు’ సినిమా చూడాల్సిందే.

*Sriranga Neethulu Movie Review: టైటిలే ఓల్డ్.. సినిమా మాత్రం గోల్డ్.. డోంట్ మిస్


Sriranga-Neethulu-2.jpg

యూనిక్ కంటెంట్‌తో డిఫరెంట్ స్క్రీన్‌ప్లే‌తో రూపొందిన ఈ చిత్రానికి వీఎస్ఎస్ ప్రవీణ్ (VSS Praveen) దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణను అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు రెండు ఓటీటీలలోనూ బ్లాక్‌బస్టర్ టాక్‌తో టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - May 30 , 2024 | 04:10 PM