Harom Hara: ‘హరోం హర’ నుంచి మురుగడి మాయ పాట విడుదల

ABN , Publish Date - May 12 , 2024 | 08:12 PM

హీరో సుధీర్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’ నుండి శనివారం విడుదల చేసిన మురుగడి మాయ పాట మంచి స్పందనను రాబట్టుకుంటోంది. టైటిల్ సూచించినట్లుగా, ప్రపంచంలో జరిగే ప్రతిచర్యకు కారణమైన మురుగన్ శక్తిని ఈ పాట నిర్వచిస్తుంది. చైతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ మెస్మరైజింగ్ నెంబర్ సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపుతుంది.

Harom Hara: ‘హరోం హర’ నుంచి మురుగడి మాయ పాట విడుదల
Harom Hara Movie Still

హీరో సుధీర్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’ (Harom Hara) నుండి శనివారం విడుదల చేసిన మురుగడి మాయ (Murugudi Maaya) పాట మంచి స్పందనను రాబట్టుకుంటోంది. టైటిల్ సూచించినట్లుగా, ప్రపంచంలో జరిగే ప్రతిచర్యకు కారణమైన మురుగన్ శక్తిని ఈ పాట నిర్వచిస్తుంది. చైతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ మెస్మరైజింగ్ నెంబర్ సుధీర్ బాబు (Sudheer Babu), సునీల్ (Sunil) స్నేహాన్ని చూపుతుంది. రఘు కుంచె ఆ పాటను అద్భుతంగా పాడారు. భరద్వాజ పాత్రుడు కుప్పం యాసలో ఈ పాటకు లిరిక్స్ రాశారు. మొత్తంమీద, మురుగడి మాయ అద్భుతమైన కంపోజిషన్, అర్థవంతమైన సాహిత్యం, ఆకట్టుకునే వోకల్స్‌తో ఇన్స్టంట్ హిట్‌గా దూసుకెళుతోంది. సుధీర్ బాబు, సునీల్ బాండింగ్ మరింత ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది.

*Vote: టాలీవుడ్ అగ్ర న‌టులు.. ఓటు ఎక్క‌డ వేయ‌నున్నారంటే!


Sudheer-Babu.jpg

ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు (Sumanth G Naidu) నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌కు ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన ఓ యదార్థ సంఘటన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ జయంతి స్పెషల్‌గా మే 31న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 12 , 2024 | 08:12 PM