Sitara Ghattamaneni: ‘ఓ మై బేబీ’ పాటకు ఎంత చక్కగా డ్యాన్స్ చేసిందో చూశారా..

ABN , Publish Date - Jan 21 , 2024 | 10:28 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’. సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఓ మై బేబీ’ పాటకు మహేష్ గారాలపట్టి సితార ఘట్టమనేని డ్యాన్స్ చేసిన వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆమె డ్యాన్స్ చూసిన వారంతా.. సితారపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sitara Ghattamaneni: ‘ఓ మై బేబీ’ పాటకు ఎంత చక్కగా డ్యాన్స్ చేసిందో చూశారా..
Sitara Ghattamaneni

సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ రూ. 200 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన రోజు కాస్త నెగిటివ్ ప్రచారం జరిగినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం అదెక్కడా కనిపించలేదు. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గానే థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ‘ఓ మై బేబీ’ లిరికల్ సాంగ్‌ (Oh My Baby Lyrical Song)పై పెద్ద దుమారమే రేగింది. కానీ ఇప్పుడా పాటకి మహేష్ గారాలపట్టి సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) వేసిన డ్యాన్స్ చూస్తుంటే.. పాట కూడా బాగుందని అనిపిస్తుంది.

‘ఓ మై బేబీ’ అనే లిరిక్స్‌తో వచ్చిన ఈ పాటపై ఫ్యాన్స్ కూడా సీరియస్ అయ్యారు. మహేష్ బాబు (Mahesh Babu) సినిమాకి ఇలాంటి పాట ఏంటి? అంటూ డైరెక్ట్‌గా వార్ స్టార్ట్ చేశారు. ఈ పాటకి వచ్చిన కామెంట్స్‌తో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాత నాగవంశీ కూడా హర్టయ్యారు. ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌పై, శృతిమించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి చురకలు వేసే ప్రయత్నం చేశారు. కానీ, ఆ తర్వాత వారు కూడా రియలైజ్ అయ్యారు. ఆ వెంటనే చిత్రానికి సంబంధించి వదిలిన మాస్ పోస్టర్స్, ట్రైలర్, కుర్చీ మడతపెట్టి సాంగ్.. విపరీతంగా నచ్చేయడంతో ‘ఓ మై బేబీ’కి విముక్తి లభించింది.


Mahesh.jpg

ఇక ఇప్పుడీ పాటకి సితార వేసిన స్టెప్స్ ముద్దుముద్దుగా ఉండటంతో.. అంతా ఆమె డ్యాన్స్‌ని, పాటని కూడా మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. సితార ఇంతకు ముందు ‘సర్కారు వారి పాట’ (SVP) సినిమాలోని పాటకు కూడా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు నటించిన సినిమాలలోని ఏదో ఒక పాటకు ఆమె ఇలా.. మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ‘ఓ మై బేబీ’ పాటకు సితార వేసిన డ్యాన్స్ చూసిన వారంతా.. ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో సూర్యదేవర రాధాకృష్ణ ఈ ‘గుంటూరు కారం’ చిత్రాన్ని నిర్మించారు. ఎస్. థమన్ (Thaman S) ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Saripodhaa Sanivaaram: దిల్ రాజు చేతుల్లోకి.. డివివి వాళ్ల సినిమా

*************************

*Rashmika Mandanna: రష్మిక డీప్‌ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్

****************************

*Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

****************************

*Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

**************************

Updated Date - Jan 21 , 2024 | 10:28 AM