RC16: ట్రెండింగ్‌లో రామ్ చరణ్ ‘RC16’.. ఎందుకో తెలుసా?

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:16 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్స్ రాకపోవడంతో.. చరణ్ తదుపరి సినిమాని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌ని ఈ సినిమాకు సంప్రదించినట్లుగా ఆయన చెబుతున్న వీడియోతో RC16 ట్రెండ్ అవుతోంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు RC16 దర్శకుడు.

RC16: ట్రెండింగ్‌లో రామ్ చరణ్ ‘RC16’.. ఎందుకో తెలుసా?
Global Star Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో.. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో, ఎప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారో అనేది ఫ్యాన్స్‌కి కూడా గందరగోళంగా మారింది. రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ ‘జరగండి’ని వదులుతామని డేట్ కూడా ప్రకటించి.. ఆ తర్వాత మళ్లీ కొన్ని కారణాల వల్ల పాటను విడుదల చేయడం లేదని, మళ్లీ మంచి డేట్ చూసి విడుదల చేస్తామని.. చివరి నిమిషంలో ఫ్యాన్స్‌ని నిరాశ పరిచారు. సరే.. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అయినా.. ఏదైనా పోస్టర్ వదలుతారేమో అని అనుకుంటే అదీ లేదు. అందుకే ఫ్యాన్స్ ఈ సినిమాని కాదని, తర్వాత చరణ్ చేయబోయే సినిమాని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. (RC16 in Trending)

Shiva-Rajkumar.jpg

‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ చేయబోయే చిత్రం ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో ఉండనుంది. RC16 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే ‘ఉప్పెన’ (Uppena)లో కీలక పాత్ర పోషించిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi)ని ఈ మూవీకి కూడా బుచ్చిబాబు సెలక్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో స్టార్ యాక్టర్ పేరు RC16 విషయంలో వైరల్ అవుతోంది. అందుకే RC16 (#RC16) హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


RC16.jpg

ఇటీవల వచ్చిన రజినీకాంత్ ‘జైలర్’ (Rajinikanth Jailer) సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar).. తన తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా కోసం తనని సంప్రదించినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. మెగా ఫ్యాన్స్ అందరూ.. బుచ్చిబాబుని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘గేమ్‌ ఛేంజర్’పై మాకు ఆశలు లేవు.. నువ్వు త్వరగా మొదలు పెట్టు అన్నా.. నీ క్యాస్టింగ్ సెలక్షన్ అదిరింది.. అంటూ ఫ్యాన్స్ ఈ వీడియోకు రియాక్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ రియాక్షన్స్‌తో RC16 ట్యాగ్ ట్రెండ్‌ని షేక్ చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Kannappa: ‘కన్నప్ప’తో ఆ డ్రీమ్ కూడా తీర్చేసుకుంటున్నారు..

**************************

*Dushara Vijayan: అంత పద్దతిగా ఉండే దుషార.. ఒక్కసారిగా దుమ్మురేపిందిగా..

*************************

*Eagle: మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు..

*************************

*Mangalavaaram: ఓటీటీలో సంచలనం.. నెక్లస్ రోడ్‌లో అరాచకం.. ఎందుకు?

**************************

Updated Date - Jan 05 , 2024 | 04:24 PM